రాజన్న సిరిసిల్ల (డైలీ భారత్): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని LV ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడిందంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
ఎంకమ్మ అనే మహిళకు ఎడమ కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉందని వైద్యులు అన్ని పరీక్షలు చేసి చెప్పారు. కానీ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చాక చూస్తే కుడి కంటికి సర్జరీ చేసినట్లు తేలడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఏ కంటికి ఆపరేషన్ చేయాలో ముందే నిర్ధారించిన తర్వాత కూడా ఇలాంటి పొరపాటు ఎలా జరిగిందని, సర్జరీకి ముందు వైద్య బృందం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
తమకు జరిగిన నష్టంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబం, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.