ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం-ఆవునూరి దయాకర్ రావు
సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి తెలుగుదేశం పార్టీ
డైలీ భారత్ రాజన్న సిరిసిల్ల : ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారాచంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్,రిమాండ్ ని నిరసిస్తూ ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి ఆవునూరి దయాకర్ రావు ఆధ్వర్యంలో చేనేత విగ్రహం నుండి గాంధీ విగ్రహం మీదుగా అంబెడ్కర్ విగ్రహం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించినా అనంతరం అంబెడ్కర్ విగ్రహానికి సైకో జగన్ కి బుద్ది ప్రసాదించి బాబు గారి మీద పెట్టిన అక్రమ కేసులు ఎలాంటి షరతులు లేకుండా ఎత్తివేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కక్ష్య సాదింపులో భాగంగానే బాబు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం బాబు గారి మీద పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.కేటీఆర్ గారు ఆంద్రప్రదేశ్ లో బాబు గారు అరెస్ట్ అయితే తెలంగాణలో ర్యాలీలు చేయడం అవసరమా అనడం సిగ్గు చేటని తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని TRS ని BRS గా మార్చి దేశం మొత్తం సభలు పెట్టుకుంటూ మీరు దేశం మొత్తం ఎలా తిరుగుతున్నారు అని ప్రశ్నించారు.కేటీఆర్ సీనియర్ ఎన్టీఆర్ గారి పేరును ఎలక్షన్లో వాడుకుంటూ పబ్బం గడుపుతున్నా మీకు రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు వంచ శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్,పార్లమెంట్ ఉపాధ్యక్షులు మచ్చ ఆంజనేయులు,పార్లమెంట్ కార్యదర్శి ఇరుకుల్లా భాస్కర్,వేములవాడ ఇంఛార్జి పులి రాంబాబు గౌడ్,TNSF రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్,TNSF కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు మోతె రాజిరెడ్డి,శ్యాగ ప్రశాంత్,చొప్పదండి ఇంఛార్జి జంగం అంజయ్య,కరీంనగర్ ఇంఛార్జి గంగాధర కనకయ్యా,రాష్ట్ర అధికార ప్రతినిధి దామేర సత్యం,నారాయణ గౌడ్,కడారి రాంరెడ్డి, నారాయణ గౌడ్,పెడ్తనపల్లి రాములు,రామస్వామి గౌడ్,ఆయుబ్ ఖాన్, md సలీం, పంజా బాలరాజు,సూర్యనాయక్,కృష్ణ,పంజా బాలరాజు,మిద్దె ప్రకాశ్,అల్లం శివమ్మా, జెట్టి కొమురయ్య,పండుగ స్వామీ,శనిగరం బాలరాజు,సల్మాన్ ఖాన్,తదితరులు పాల్గొన్నారు.