| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎక్సైజ్, పోలీసులు సమన్వయంతో పని చేయాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

ఎక్సైజ్, పోలీసులు సమన్వయంతో పని చేయాలి : ఎస్పీ అఖిల్ మహాజన్

డైలీ భరత్, రాజన్న సిరిసిల్ల: రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎక్సైజ్ శాఖ,  పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారని ఎక్సైజ్ సిఐ ఎంపిఆర్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో ఎస్పీ సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసినట్లు సిఐ తెలిపారు. నాటుసారాయి తయారు, రవాణా, సేవించే ప్రాంతాలను గుర్తించి వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారన్నారు. నాటుసారాయికి ఉపయోగించే ముడి పదార్థాలైన బెల్లం, పటిక అమ్మేవారిని ముందే గుర్తించి సంబంధిత తహసీల్దార్ ల ముందు బొండోవర్లు చేయాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చేవారిపై కఠినంగా వ్యవరించాలని ఆదేశించారు. గంజాయి, మత్తు పదార్థాల సేవించే వారిపై, అక్రమ వ్యాపారం చేసేవారిపై రహస్యంగా సమాచారం సేకరించి , పట్టుకుని జైలుకు పంపించాలని ఎస్పీ ఆదేశించారన్నారు. సమావేశంలో ఎక్సైజ్ సిఐ లు  గులామ్ ముస్తఫా, గుండేటి రాము, మరాఠీ పోష్ రాజ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Previous నన్ను బ్రతికుండగానే చంపేశారు
Next బాబు గారికి తోడుగా.. ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం-ఆవునూరి దయాకర్ రావు
ADVERTISEMENT