Posted on 2026-07-24 13:53:56
ప్రధాన నిందితుడు, భార్య, మామ ముగ్గురు నిందితుల అరెస్ట్
అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి భూమి రిజిస్ట్రేషన్ – శాస్త్రీయ దర్యాప్తుతో గుట్టురట్టు
అప్పులు తీర్చుకునేందుకు నకిలీ పత్రాల సృష్టి – భార్య పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేసిన ప్రధాన నిందితుడు అరెస్ట్
భూముల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలి – తప్పుడు రిజిస్ట్రేషన్లకు పాల్పడితే కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ
కేసు వివరాలు వెల్లడించిన కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్
డైలీ భారత్, కామారెడ్డి: గంభీరావుపేట నివాసి ముక్తావరం శాంత, తన భర్త ముక్తావరం వెంకటయ్య పేరుపై ఉన్న దేవునిపల్లి వార్డు పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ, సర్వే నెం.210/1లో గల ప్లాట్ నెం.71 (సుమారు 200 చదరపు గజాలు)కు సంబంధించిన భూమిని నకిలీ పత్రాలు సృష్టించి, అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు, కామారెడ్డి డీఎస్పీ శ్రీ మధుసూదన్ పర్యవేక్షణలో, కామారెడ్డి రూరల్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ మరియు దేవునిపల్లి ఎస్‌హెచ్‌ఓ రంజిత్ శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో కేసును లోతుగా దర్యాప్తు చేశారు.
దర్యాప్తులో భాగంగా సాక్షుల వాంగ్మూలాలు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలోని రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, సాంకేతిక ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించగా, ప్రధాన నిందితుడు బండారి శ్రీనివాస్ రెడ్డి ఈ కుట్రకు సూత్రధారి అని నిర్ధారణ అయింది.
ప్రధాన నిందితుడు బండారి శ్రీనివాస్ రెడ్డి తనపై ఉన్న అప్పులను తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని విక్రయించేందుకు కుట్ర పన్నినట్లు తేలింది. ఇందులో భాగంగా తన భార్య బండారి సునీతను కొనుగోలుదారుగా చూపించి, తన మామ గున్‌రెడ్డి సంగారెడ్డిని అసలు యజమాని ముక్తావరం వెంకటయ్యగా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో హాజరుపరిచి, తప్పుడు గుర్తింపు పత్రాలు, నకిలీ ఆధారాలతో అక్రమంగా దేవునిపల్లి వార్డు పరిధిలోని కాకతీయ నగర్ కాలనీ, సర్వే నెం.210/1లో గల ప్లాట్ నెం.71 (సుమారు 200 చదరపు గజాలు నురిజిస్ట్రేషన్ చేయించినట్లు విచారణలో వెల్లడైంది.
అనంతరం అదే భూమిని అసలు విషయాన్ని దాచిపెట్టి ఇతరులకు విక్రయించినట్లు, ఆ స్థలం పలువురి పేర్లపై వరుసగా రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. శాస్త్రీయ దర్యాప్తు, సాంకేతిక ఆధారాలు, రెవెన్యూ రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాల పరిశీలన ద్వారా నిందితుల మోసం వెలుగులోకి వచ్చింది.
విచారణలో ప్రధాన నిందితుడు తన నేరాన్ని అంగీకరించగా, క్రింది నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.
అరెస్టు చేసిన నిందితులు
1. బండారి శ్రీనివాస్ రెడ్డి
2. బండారి సునీత
( ఆరగొండ గ్రామం, రాజంపేట్ మండలం )
3. గున్‌రెడ్డి సంగారెడ్డి (తాడ్వాయి మండలం ఎండ్రియల్ గ్రామం )
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ మాట్లాడుతూ, భూములు లేదా స్థలాలు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూమి యాజమాన్య హక్కులు, పాత రిజిస్ట్రేషన్ చరిత్ర, రెవెన్యూ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు, ఎన్‌కంబ్రెన్స్ సర్టిఫికెట్ (EC) తదితర పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని తెలిపారు. విక్రేత అసలు యజమానియేనా అనే విషయాన్ని ఆధార్, ఫోటో గుర్తింపు, బయోమెట్రిక్ వివరాలు మరియు సంబంధిత అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలు, మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు విక్రయించే భూముల విషయంలో ప్రత్యేక అప్రమత్తత అవసరమని పేర్కొన్నారు.
నకిలీ పత్రాలు సృష్టించడం, వేరే వ్యక్తిని అసలు యజమానిగా చూపించి రిజిస్ట్రేషన్ చేయించడం, ప్రజలను మోసం చేయడం వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే ఇటువంటి భూముల మోసాలను అరికట్టడం సాధ్యమవుతుందని, అనుమానాస్పద భూ లావాదేవీలు లేదా మోసాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >