| Daily భారత్
Logo




ఆర్మీ భూములు కాపాడాలంటూ హైడ్రాకు విన‌తిప‌త్రం

News

Posted on 2026-07-24 04:20:53

Share: Share


ఆర్మీ భూములు కాపాడాలంటూ హైడ్రాకు విన‌తిప‌త్రం

హైడ్రా క‌మిష‌న‌ర్‌ను క‌లిసి వినతి పత్రాన్ని అందజేసిన ఆర్మీ లెఫ్ట్‌నెంట్ క‌ల్న‌ల్‌

డైలీ భారత్, హైదరాబాద్:ఆర్మీకి చెందిన భూమిని క‌బ్జా చేసి నిర్మాణాలు చేప‌డుతున్నార‌ని..  ఆ భూమిని కాపాడాల‌ని ర‌క్ష‌ణ శాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారులు హైడ్రాను ఆశ్ర‌యించారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ని ఆర్మీ లెఫ్ట్‌నెంట్ క‌ల్న‌ల్ జై సింగ్ క‌ల‌సి ఈమేర‌కు విన‌తిప‌త్రం అంద‌జేశారు. మేడ్చ‌ల్ - మ‌ల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండ‌లం, గ్రామంలోని జీఎల్ఆర్ స‌ర్వే నంబ‌రు 507లోని .. ఆర్మీకి చెందిన‌ ఏ-1 భూమి ఉండ‌గా అందులో ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతున్నాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్మీకి చెందిన భూమిని ఆక్ర‌మించి జి ప్ల‌స్ 2 భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నార‌ని తెలిపారు. ఆ నిర్మాణానికి అనుమ‌తులు కూడా లేవ‌ని పేర్కొన్నారు. వెంట‌నే నిర్మాణాల‌ను ఆపించి ఆ స్థ‌లాన్ని కాపాడాల‌ని కోరారు. విన‌తిప‌త్రాన్ని ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించి ఆక్ర‌మ‌ణ‌ల‌ను నిర్ధారించుకున్న త‌ర్వాత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైడ్రా అధికారులను ఆదేశించారు.  హైడ్రా కమిషనర్ ను లెఫ్టినెంట్ కల్నల్ కలిసినప్పుడు హైడ్రా ACP ఉమామహేశ్వర రావు గారు కూడా ఉన్నారు.

#HYDRAA #ArmyLand #DefenceLand #ProtectPublicAssets #StopEncroachments

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >