| Daily భారత్
Logo




యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

News

Posted on 2026-07-15 19:05:38

Share: Share


యాస... మన అస్తిత్వపు స్వరం : మంజుల పత్తిపాటి

డైలీ భారత్ స్పెషల్: 

యాస... మన అస్తిత్వపు స్వరం...

యాసను చూసి మనిషిని కొలవకు...!

ఎందుకంటే... యాస వెనుక ఒక ఊరి ఊపిరి ఉంటుంది... ఆ ఊరి మట్టి పరిమళం ఉంటుంది... ఆ మట్టిలో తరతరాల మమకారం ఉంటుంది... ఆ మాటల్లో మనసుల మధురం ఉంటుంది...!

పుస్తకాల్లో భాషకు అక్షరాల అందం ఉంటే... పల్లె పెదవుల పలుకుల్లో జీవన గంధం ఉంటుంది...! గ్రంథాల్లో వ్యాకరణం ఉంటే... గ్రామీణ యాసలో అనుభవాల ఆభరణం ఉంటుంది...!

అది బడిలో బోధించిన భాష కాదు... అమ్మ ఒడిలో ఆలపించిన ఆప్యాయ గీతం... నాన్న నుదుటి చెమటలో నిండిన జీవన జ్యోతి... రైతు నేలతో పలికిన పచ్చని మాట... కూలీ కష్టంలో వినిపించిన నిజమైన గీతం..!

యాసను హేళన చేయడం అంటే... ఒక మాటను కాదు... ఒక మనిషి మూలాలను మట్టుబెట్టడం... అతని ఊరి గౌరవాన్ని గాయపరచడం... అతని జ్ఞాపకాల జాడలను చెరిపివేయడం...!

ప్రతి యాస వెనుక ఒక యుగం ఉంటుంది... ప్రతి పలుకు వెనుక ఒక అనుభవం ఉంటుంది... ప్రతి మాటలో ఒక మనిషి మనసు ఉంటుంది... ప్రతి స్వరంలో ఒక సంస్కృతి శ్వాసిస్తుంది...

యాస మారితే మనిషి మారడు... మాట మారినా మనసు మారదు... పలుకు మారినా పుట్టిన నేల మారదు... మారేది కేవలం భాషకు వచ్చిన భిన్నమైన అందం మాత్రమే..!

కాబట్టి... యాసలను ఆదరిద్దాం... భాషలను ప్రేమిద్దాం... భిన్నత్వంలోని అందాన్ని ఆస్వాదిద్దాం...!

ఎందుకంటే... భాష మనల్ని కలుపుతుంది... యాస మన మూలాలను నిలుపుతుంది... యాసను గౌరవించడం అంటే... మన సంస్కృతికి శిరస్సు వంచి నమస్కరించడం మాత్రమే..!

అదే నిజమైన విద్య... అదే నిజమైన వినయం... అదే నిజమైన సంస్కారం... అదే నిజమైన నాగరికత.

రచన: మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218.

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >