Posted on 2026-07-15 15:28:33
డైలీ భారత్, సిరిసిల్ల: ప్రజా సమస్యలపై అధికారులు స్పందించకపోవడంతో 7వ వార్డు బిజెపి కౌన్సిలర్ ఎర్రం వెంకట్రాజం నాయకుడిగా కాకుండా సేవకుడిగా మారి నిరసన తెలిపారు.
వార్డులో డ్రైనేజీలు పూడికతో నిండి దుర్వాసన వస్తున్నా మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కౌన్సిలర్ స్వయంగా డ్రైనేజీలో దిగి శుభ్రం చేసి ప్రజలకు ఉపశమనం కలిగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "ప్రజలు మమ్మల్ని సేవ చేయడానికి గెలిపించారు. అధికారులు బాధ్యతగా పని చేయాలి. సిరిసిల్ల మొత్తం పట్టణంలో పారిశుద్ధ్యం సరిగా ఉండేలా చూడాలి" అని డిమాండ్ చేశారు.
అధికార పార్టీలపై విమర్శలు
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సిరిసిల్ల మున్సిపాలిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, సీఎం మరియు మంత్రుల నుండి ఎలాంటి నిధులు, సహాయం రావడం లేదని ఆరోపించారు.
అలాగే స్థానికంగా అధికారంలో ఉన్న BRS పార్టీ నాయకులు, ఎమ్మెల్యే కేటీఆర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లు కేవలం మాటలకే పరిమితమయ్యారని, చేతల్లో ఏమీ లేదని మండిపడ్డారు. కనీసం పరిశుద్ధ కార్మికులను కూడా సరిగా కేటాయించలేకపోతున్నారని ఆయన విమర్శించారు.
ప్రస్తుతం ఈ ఘటన సిరిసిల్లలో వైరల్ గా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >