| Daily భారత్
Logo




స్కూల్ బస్సులు , ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ తనిఖీలు నిర్వహించాలి

News

Posted on 2026-06-10 04:16:43

Share: Share


స్కూల్ బస్సులు , ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ తనిఖీలు నిర్వహించాలి

జిల్లా రవాణా శాఖ అధికారి జేఎన్ శ్రీనివాస్ కి వినతిపత్రం

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో నడుస్తున్న స్కూల్ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి , భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఆర్ టిడబ్ల్యుఎఫ్ - సీఐటీయూ) ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షుడు వై విక్రమ్ , కార్యదర్శి జిల్లా ఉపేందర్ లు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీవో జిల్లా కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారి జేఎన్ శ్రీనివాస్ కి వినతిపత్రం  అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో విద్యార్థులు మరియు సాధారణ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని స్కూల్ బస్సులు , ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీ డ్రైవ్ నిర్వహించాలని కోరారు . వాహనాల బ్రేకులు , టైర్లు , అత్యవసర ద్వారాలు , ఫస్ట్ ఎయిడ్ బాక్స్ , ఫైర్ ఎక్స్టింగ్విషర్ , బీమా పత్రాలు , అనుమతులు మరియు ఇతర భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హత కలిగిన వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు . ప్రమాదాలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అని కోరారు . ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జరుపుల ప్రమీల , మధు , టి. రాంబాబు లు పాల్గొన్నారు . అలాగే యూనియన్ నాయకులు ఏఐఆర్ టిడబ్ల్యుఎఫ్ - సీఐటీయూ ఖమ్మం జిల్లా ప్రైవేట్ స్కూల్  బస్సు డ్రైవర్ల  యూనియన్ జిల్లా నాయకులు శ్రీనివాస్ , నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .

Image 1

సిరిసిల్లలో పెళ్లి మండపం వద్ద గొడవ... పలువురిపై కేసు నమోదు

Posted On 2026-08-30 18:04:50

Readmore >
Image 1

ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్

Posted On 2026-08-30 17:15:04

Readmore >
Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >