| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్!

కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు నిందితుల అరెస్ట్!

డైలీ భారత్, కామారెడ్డి:కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ B. హన్మంతరావు ఆదేశాల మేరకు, ఈరోజు (మంగళవారం) కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు రైల్వే స్టేషన్‌లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. సంబల్పూర్ నుండి నాందేడ్ వెళ్లే ,"నాగవలి ఎక్స్‌ప్రెస్" (ట్రైన్ నంబర్: 20809) లో తనిఖీలు చేస్తుండగా.. ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు పట్టుబడ్డారు.

వారిని తనిఖీ చేయగా వారి వద్ద నుండి 10 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది.

ముఖ్య విషయాలు : 

నిందితులు మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన సునీల్ మరియు ప్రవీణ్.

రవాణా మార్గం: నిందితులు ఒడిశాలోని రాయగడలో ఈ ఎండు గంజాయిని కొనుగోలు చేసి, మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుబడినట్లు కామారెడ్డి ఎక్సైజ్ సీఐ CH. సంపత్ కృష్ణ  తెలిపారు.

చర్యలు: నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విజయవంతమైన తనిఖీలలో ఎక్సైజ్ సీఐ CH. సంపత్ కృష్ణ, ఎస్ఐ M. విక్రమ్ కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు జాన్, బలవంతరావు, ఫరూఖ్ మరియు సిబ్బంది రాజు, పవన్ రెడ్డి, బాబు, శరత్, వందన తదితరులు పాల్గొన్నారు.

Previous ప్రభుత్వ విద్య సంస్థలలో మౌలిక వసతులు కల్పించాలి
Next స్కూల్ బస్సులు , ప్రైవేట్ బస్సుల ఫిట్నెస్ తనిఖీలు నిర్వహించాలి
ADVERTISEMENT