Posted on 2026-06-10 07:40:37
ఫీజు నియంత్ర చట్టాన్ని అమలు చేయాలి
ఏ ఐ ఏఫ్ డి ఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్
అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా విద్యాశాఖ సంబంధిత అధికారి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది
డైలీ భారత్, కామారెడ్డి : ఈ సందర్భంగా ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్ మాట్లాడుతూ..... తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ విద్య సంస్థలలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడ లాగే అనుచందంగా ఉంది. విద్యా సంవత్సరం జూన్ 15వ తేదీన అన్ని విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయి కానీ ఇప్పటివరకు ప్రభుత్వ విద్య సంస్థలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి కృషి చేయాలని అన్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేర్లతో ప్రభుత్వ పాఠశాలలు ముసే ఆలోచనలు ఉందని వారు ఆరోపణ చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ నాన్ టీచింగ్ ఎంఈఓ డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికడుతామని, పేద, మధ్యతరగతి ప్రజలకు ఫీజుల భారం లేకుండా చూస్తామని చెప్పిన ముఖ్యమంత్రి మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. ప్రైవేట్ విద్యాసంస్థల్లో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు తక్షణమే ఆన్లైన్లో పెట్టాలని విద్యాశాఖ అధికారులకు చెప్పిన ప్రతిపాదనలు నేటికీ అమలుకు నోచుకోలేదు.
ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ నేడు విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారమయం చేశాయి.
పేద మధ్య తరగతి వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆశలను ఆసరాగా చేసుకుని వారికి అనేక మాయమాటలు ప్రచార ఆర్భాటాలతో అరచేతిలో వైకుంఠం చూపించి అడ్మిషన్ చేసుకొని ఆ తర్వాత అడ్మిషన్, బుక్స్ ,స్టేషనరీ, డెవలప్మెంట్, ల్యాబ్, లైబ్రరీ, గేమ్స్ మరియు ఐఐటి, నీట్ ఫౌండేషన్, ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ ఫీజులు అంటూ అనేక రకాల ఫీజుల పేరుతో లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా పీల్చి పిప్పి చేస్తూ, వారి రక్తాన్ని జలగల్ల జర్రుకుంటున్న స్థితి నెలకొంది.
జిల్లాలో కలెక్టర్, డిఇఓ, స్కూల్ ప్రిన్సిపాల్, పేరెంట్స్ తో కలిపి డీ.ఎఫ్.ఆర్.సి. (జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీ) సూచనల మేరకు ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులు నిర్ణయించాల్సి ఉంటుంది.
ప్రతి స్కూల్లో ప్రతి తరగతికి సంబంధించిన ఫీజుల వివరాలతో కూడిన బోర్డు కచ్చితంగా ఉండాలి. విద్య హక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యా సంస్థ 25% సీట్లను ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్స్ కల్పించాల్సి ఉంది. కానీ ఏ ఒక్క విద్య సంస్థ కూడా విద్య హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన సిలబస్ ను పక్కనపెట్టి తమ ఇష్టారాజ్యంగా తమ సొంత సిలబస్ రూపొందించుకొని అమలు చేస్తూ బోధిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఒక విద్యా సంస్థ పేరు మీద పర్మిషన్ తీసుకొని, సంబంధిత విద్యాశాఖ అధికారుల వద్ద నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా 4 నుండి 10 వరకు అదనపు బ్రాంచీలు నెలకొల్పుకొని వాటికి డిజి, టెక్నో,ఇ- టెక్నో, ప్లే ,ఐఐటి, మెడికల్ ఫౌండేషన్, గ్లోబల్, లాంటి తోక పేర్లు తగిలించుకొని విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. రెసిడెన్షియల్ పర్మిషన్ లేకుండా హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. కనీసం ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేకుండా అపార్ట్మెంట్లలో, ఇరుకు గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. కింది నుండి పై వరకు సంబంధిత విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలు ఇచ్చే ఆర్దిక తైలాలకు ఆశపడి చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని ఏ ఐ ఏఫ్ డి ఎస్ ఎన్నోసార్లు ఆందోళనలు నిర్వహించి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి ప్రైవేట్ ,కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తూ, ఫీజు నియంత్ర చట్టాన్ని అమలు చేయాలని వారు అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేసే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ డీఎస్ జిల్లా కార్యదర్శి ఎండి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు
రెసిడెన్షియల్ విద్యాలయం పనుల్లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-10 20:53:10
Readmore >
తెలంగాణ బిడ్డ జనసేన ను ఆదరించండి : జనసేన నేత డా. గడల శ్రీనివాసరావు
Posted On 2026-06-10 20:34:47
Readmore >
మోదీ 4399 రోజుల చారిత్రాత్మక పాలనకు గుర్తుగా ప్రత్యేక పూజలు
Posted On 2026-06-10 20:33:30
Readmore >
హైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు
Posted On 2026-06-10 20:16:57
Readmore >
గ్రామ సభలో హెల్మెట్ లను అందించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, adl SP నర్సింహా రెడ్డి
Posted On 2026-06-10 20:14:32
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కురుపాటి రఘు కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-10 20:12:45
Readmore >
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా దేవాలయంలో పూజలు
Posted On 2026-06-10 16:44:28
Readmore >