డైలీ భారత్, దమ్మపేట: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ముస్టి బండ గ్రామము శివాలయంలో బీజేపీ పార్టీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగినది,భారతదేశంలో ప్రజలచే ఎన్నికై అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానమంత్రిగా కొనసాగిన రికార్డు నరేంద్ర మోడీ సాధించారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీర్ఘ ఆయుష్షు,ఆరోగ్యవంతమైన జీవితం,భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వేడుకుంటూ ఈ పూజలు నిర్వహించడం జరిగినది,ఇ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,దొడ్డా సతీష్,పూచి ప్రసాద్,శివ,కారం రత్నకుమారి,ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.
News
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా దేవాలయంలో పూజలు