| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రోడ్డు భద్రతపై అవగాహన కోసం “Arrive Alive” వాకింగ్ ర్యాలీ

రోడ్డు భద్రతపై అవగాహన కోసం “Arrive Alive” వాకింగ్ ర్యాలీ

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు (జూన్ 10, బుధవారం) ఉదయం 8:00 గంటలకు సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం నుండి బతుకమ్మ ఘాట్ వరకు “Arrive Alive” అవగాహన వాకింగ్ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, డీఎస్పీ కె నాగేంద్ర చారి పాల్గొని రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు.

అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు, మంజుల మేడం, సురేష్ పీడీ తదితరులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.

“నిబంధనలు పాటిద్దాం – సురక్షితంగా గమ్యస్థానానికి చేరుదాం” అనే సందేశంతో ఈ ర్యాలీ నిర్వహించబడింది.

Previous తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా మృతి
Next ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అరుదైన ఘనత సాధించిన సందర్భంగా దేవాలయంలో పూజలు
ADVERTISEMENT