Posted on 2026-06-10 17:10:55
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్ పై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లోని వివిధ అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో చేనేత జౌళి శాఖ అధికారులు, పరిశ్రమల శాఖ, ఇరిగేషన్ శాఖ, మిషన్ భగీరథ శాఖలకు చెందిన అధికారులు,టెక్స్‌టైల్ పార్క్ అసోసియేషన్ బాధ్యులతో బుధవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్క్‌లోని ప్లాట్ల బదిలీకి సంబంధించిన ఎన్ఓసీల జారీ, టెక్స్‌టైల్ పార్క్‌కు నీటి సరఫరా, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (సీఈటీపీ)వినియోగం, కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ ) ఏర్పాటు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు జారీ చేస్తూ, టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్లాట్ల బదిలీ, ఎన్ఓసీల జారీకి సంబంధించి అందిన అర్హత కలిగిన దరఖాస్తులను వీలైనంత త్వరగా స్టేట్ లెవల్ కమిటీ సమావేశంలో పరిశీలనకు ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టెక్స్‌టైల్ పార్క్‌కు నీటి సరఫరా కోసం ఇరిగేషన్ మిషన్ భగీరథ అధికారులతో కలిసి టెక్స్‌టైల్ పార్క్‌కు నీటి లభ్యత ఉన్న ప్రత్యామ్నాయ వనరులను గుర్తించాలని సూచించారు. టెక్స్‌టైల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ వినియోగంలోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. భవిష్యత్తులో డైయింగ్, ప్రాసెసింగ్ వంటి యూనిట్లు ఏర్పాటు అయితే సీఈటీపీ సమర్థవంతంగా వినియోగించుకునేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్ పై సమగ్ర ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో చేనేత, జౌళి సహాయ సంచాలకులు సంతోష్ కుమార్, ఈఈ మిషన్ భగీరథ ముజాహిబ్ అన్వర్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం హన్మంతు, టెక్స్‌టైల్ పార్క్ అసోసియేషన్ సభ్యులు, యూనిట్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి
Posted On 2026-08-29 15:12:04
Readmore >
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
Posted On 2026-08-29 15:11:10
Readmore >
కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్‌కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్
Posted On 2026-08-29 15:08:39
Readmore >
సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు
Posted On 2026-08-29 10:54:50
Readmore >