| Daily భారత్
Logo




హైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

News

Posted on 2026-06-10 16:46:57

Share: Share


హైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర ముఠా అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు

మూడు కేసులను ఛేదించిన మద్నూర్ పోలీసులు

ముగ్గురు నిందితుల అరెస్ట్ – రెండు బైకులు, నాలుగు మొబైల్ ఫోన్లు, మూడు కత్తుల స్వాధీనం

వివరాలు వెల్లడించిన బాన్సువాడ  డీఎస్పీ శ్రీ బి. విఠల్ రెడ్డి  

డైలీ భరత్ కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పరిధిలోని మద్నూర్, జుక్కల్, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో హైవేలపై ఒంటరిగా ప్రయాణిస్తున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర నేర ముఠాను మద్నూర్ పోలీసులు అరెస్ట్ చేసి మూడు కీలక కేసులను ఛేదించారు.

తేదీ 02.06.2026న మద్నూర్ గ్రామ సమీపంలోని జాతీయ రహదారి-161పై బైక్‌పై ప్రయాణిస్తున్న షేక్ గౌస్ (నివాసం: దెగ్లూర్, మహారాష్ట్ర)ను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తి చూపించి చంపుతామని బెదిరించి అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ మరియు రూ.1000 నగదును దోచుకెళ్లారు. ఈ ఘటనపై మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, బాన్సువాడ డీఎస్పీ బి. విఠల్ రెడ్డి గారి పర్యవేక్షణలో బిచ్కుంద సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, మద్నూర్ ఎస్‌ఐ మోహన్ రెడ్డి, CCS ఎస్‌ఐ ఉస్మాన్ తో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్‌ల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు

కేసు వివరాల్లోకి వెళితే

దర్యాప్తులో భాగంగా నిందితులు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ ఇలియాస్, మహమ్మద్ ఇస్మాయిల్ @ జునైద్, సమీర్ షా అని గుర్తించారు. వీరు హైవేలపై ఒంటరిగా ప్రయాణించే వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని మారణాయుధాలతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.

పథకం ప్రకారం 01.06.2026న నాందేడ్ నుండి స్ప్లెండర్ బైక్‌పై బయలుదేరిన నిందితులు మద్నూర్ వద్ద షేక్ గౌస్‌ను దోచుకోవడంతో పాటు, అదే రాత్రి జుక్కల్ చౌరస్తా వద్ద వి. శ్రీనివాస్‌ను కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్ మరియు రూ.300 నగదు లాక్కొన్నారు. అదే రోజు రాత్రి నిజాంసాగర్ పరిధిలో చాకలి రాజు వద్ద నుండి పల్సర్ బైక్‌ను దోచుకున్నారు. ఈ మూడు ఘటనలపై మద్నూర్, జుక్కల్, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు.

దర్యాప్తు సమయంలో నిందితులు సలబతుపూర్ సమీపంలో మరో వ్యక్తిని అడ్డగించి కత్తితో బెదిరించి దోపిడీ చేయాలని వస్తుండగా, అదే సమయంలో సలబతుపూర్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు వారిని గుర్తించి పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు చేసిన నేరాలను అంగీకరించారు.

నిందితుల వివరాలు:

1. షేక్ ఇలియాస్ (తండ్రి: ఇర్ఫాన్, దెగ్లూరు నాకా, నాందేడ్) 

2. మహమ్మద్ ఇస్మాయిల్ @ జునైద్ (తండ్రి: అబ్దుల్ హమీద్, నాందేడ్) 

3. సమీర్ షా (తండ్రి: నాజుక్ షా, మిల్లెట్ నగర్, నాందేడ్) 

స్వాధీనం చేసుకున్న వస్తువులు:

1. 3 కత్తులు (దోపిడీలకు ఉపయోగించినవి) 2.   4 మొబైల్ ఫోన్లు 3.   2 మోటార్‌సైకిళ్లు 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, హైవేలపై ప్రయాణించే సమయంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని డిఎస్పి తెలిపారు.

ఈ కేసులను చాకచక్యంగా ఛేదించిన బిచ్కుంద సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, మద్నూర్ ఎస్‌ఐ మోహన్ రెడ్డి, CCS ఎస్‌ఐ ఉస్మాన్, కానిస్టేబుళ్లు విఠల్, విష్ణు, శ్రావణ్, శివ, శ్రీకాంత్ తదితరులు మరియు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్  అభినందించినట్లు డీఎస్పీ విఠల్ రెడ్డి  తెలిపారు

Image 1

రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్

Posted On 2026-08-30 15:06:17

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకుల భూమిపూజ

Posted On 2026-08-30 15:04:21

Readmore >
Image 1

బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం

Posted On 2026-08-30 14:01:50

Readmore >
Image 1

వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్

Posted On 2026-08-30 13:59:15

Readmore >
Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >