| Daily భారత్
Logo




మోదీ 4399 రోజుల చారిత్రాత్మక పాలనకు గుర్తుగా ప్రత్యేక పూజలు

News

Posted on 2026-06-10 17:03:30

Share: Share


మోదీ 4399 రోజుల చారిత్రాత్మక పాలనకు గుర్తుగా  ప్రత్యేక పూజలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  వరుసగా 4399 రోజులపాటు దేశానికి నాయకత్వం వహిస్తూ భారత రాజకీయ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా సేవలందించిన ఎన్నికైన ప్రధానమంత్రిగా చారిత్రాత్మక మైలురాయిని అధిగమించిన సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని సెంట్రల్ వర్క్ షాప్ వద్ద గల శ్రీ  పెద్దమ్మ తల్లి ఆలయంలో   భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ఠ మరింత పెరగాలని ఆకాంక్షిస్తూ నాయకులు అమ్మవారిని  దర్శించుకొని ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ జీవీకే మనోహర్రావు  మాట్లాడుతూ, స్వాతంత్ర్యానంతర భారత రాజకీయ చరిత్రలో నరేంద్ర మోదీ  పాలన ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిందన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి "సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్" లక్ష్యంతో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు.మోదీ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, 4 కోట్లకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం, 15 కోట్లకు పైగా ఇంటింటికీ తాగునీటి కనెక్షన్లు, 10 కోట్లకు పైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 55 కోట్లకు పైగా జనధన్ బ్యాంకు ఖాతాలు, 11 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం, 14 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు, 11 కోట్ల మంది రైతులకు పీఎం కిసాన్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలు సామాన్య ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాయని తెలిపారు.అలాగే, భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం, డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచానికి ఆదర్శంగా నిలవడం, జీ-20 అధ్యక్షతను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. చంద్రయాన్-3 విజయంతో చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా నిలవడం, రికార్డు స్థాయిలో జాతీయ రహదారులు, రైల్వేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించడం మోదీ నాయకత్వ సామర్థ్యానికి నిదర్శనాలని పేర్కొన్నారు.

అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం, గిరిజన మహిళ ద్రౌపది ముర్ము ని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం, గిరిజన సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం కల్పించడం వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు మోదీ నాయకత్వంలో అమలయ్యాయని తెలిపారు.ప్రపంచ దేశాల మధ్య భారతదేశ ప్రతిష్ఠను మరింత పెంచుతూ, 2047 నాటికి "వికసిత భారత్" లక్ష్య సాధన దిశగా మోదీ  కృషి చేస్తున్నారని, ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి మరింత కాలం దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జాటోత్ వెంకన్న నాయక్, సీనియర్ నాయకులు పైడిపాటి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షురాలు, నాలుగోవ డివిజన్ బిజెపి కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, బిజెపి మహిళా నాయకురాలు సముద్రాల గాయత్రి, పద్మ లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు నవీన్, చుంచుపల్లి మండల అధ్యక్షులు బలగం శ్రీధర్, మోహన కృష్ణ,  గుమలాపురం సత్యనారాయణ, సీనియర్ నాయకులు నరేంద్ర బాబు, చిన్నీ, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

ఆదివాసీ యువతి ఊకె శిరీష అనుమానాస్పద మృతి

Posted On 2026-08-30 12:11:35

Readmore >
Image 1

సిరిసిల్ల పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సిద్ధి దేవరాజు

Posted On 2026-08-30 10:54:25

Readmore >
Image 1

ప్రాథమిక పాఠశాలలో వనమోత్స కార్యక్రమం

Posted On 2026-08-29 18:02:37

Readmore >
Image 1

కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ నాయకుల సవాల్

Posted On 2026-08-29 18:01:33

Readmore >
Image 1

ఆగస్టు 31న నిజామాబాద్‌లో జరిగే పంచజన్య సభను విజయవంతం చేయాలి

Posted On 2026-08-29 15:12:04

Readmore >
Image 1

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

Posted On 2026-08-29 15:11:10

Readmore >
Image 1

కామారెడ్డి అభివృద్ధిపై కేసీఆర్​కు సైతం బాధ్యత ఉంది... కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఐరేనీ సందీప్

Posted On 2026-08-29 15:08:39

Readmore >
Image 1

సిరిసిల్లలో మూతపడ్డ మున్సిపల్ మరుగుదొడ్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు

Posted On 2026-08-29 10:54:50

Readmore >
Image 1

40 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?...

Posted On 2026-08-29 09:21:01

Readmore >
Image 1

AIMIM నుండి ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బహిష్కరణ!

Posted On 2026-08-29 08:32:31

Readmore >