Posted on 2026-06-10 04:45:36
35 కలప దుంగలు స్వాధీనం..
అటవీశాఖ అధికారులకు అప్పగింత:టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్
డైలీ భారత్, గంభీరావుపేట: గంబిరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన చంద్రమౌళి , s/o బాలకిష్టయ్య తన ఇంటి ఆవరణలో అటవీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా 35 కలప దుంగలను నిల్వ ఉంచడాన్నా విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది అక్రమ కలప నిల్వలు, రవాణాపై మెరుపు దాడులు చేయగా గుర్తించిన 35 కలప దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ తెలిపారు.స్వాధీనం చేసుకున్న కలప దుంగలను తదుపరి చర్యల నిమిత్తం అటవీశాఖ సెక్షన్ అధికారి పద్మాలతకు అప్పగించినట్లు వెల్లడించారు.అక్రమంగా కలప నిల్వలు, రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, ప్రజలు అటవీ సంపద పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు.
ఈతనిఖీల్లో హెడ్ కానిస్టేబుళ్లు తిరుపతి, ఉమాపతి, రాజేష్, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.
ఉద్యమకారుల హక్కుల సాధనే లక్ష్యం... నూతన JAC చైర్మన్ గజ్జెల దేవరాజ్
Posted On 2026-08-30 17:15:04
Readmore >రైతుల భూములను రైతులకే తిరిగి ఇవ్వాలి - స్థానిక ఎమ్మెల్యే తక్షణమే స్పందించాలి : బీజేపీ డిమాండ్
Posted On 2026-08-30 15:06:17
Readmore >బాహ్య మూల్యాంకన విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : TPTF జిల్లా అధ్యక్షులు చింతల లింగం
Posted On 2026-08-30 14:01:50
Readmore >వృద్ధులు, బీడీ కార్మికులకు అన్యాయం... కాంగ్రెస్ ప్రభుత్వంపై సిరిసిల్ల కౌన్సిలర్ ఫైర్
Posted On 2026-08-30 13:59:15
Readmore >