Posted on 2026-06-07 09:34:42
డైలీ భారత్, కామారెడ్డి: ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కామారెడ్డి పట్టణంలో “హరిత భవిష్యత్తు కోసం సైక్లింగ్” అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ సైక్లింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు.
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ సహకారంతో ఫిట్ ఇండియా ఉద్యమం కింద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే సైక్లింగ్‌ను ప్రజల్లో ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సైక్లింగ్ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో సైక్లింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజంతో పాటు పచ్చని పర్యావరణాన్ని నిర్మించడంలో భాగస్వాములు కావాలని సూచించారు.
దేశవ్యాప్తంగా ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యువత, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రభుత్వ అధికారులు , వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా ఈ సైక్లింగ్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ NV గిరి, dyso వెంకటేశ్వర్లు, drdo దామోదర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, , క్రీడా సంఘాల సభ్యులు , యువత తదితరులు పాల్గొన్నారు.
ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
Posted On 2026-07-23 16:06:22
Readmore >
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
Posted On 2026-07-23 16:04:59
Readmore >
వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-23 15:59:08
Readmore >
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు
Posted On 2026-07-23 15:56:26
Readmore >
నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం
Posted On 2026-07-23 15:54:39
Readmore >
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ
Posted On 2026-07-23 14:52:41
Readmore >
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >