| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్

మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్

సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, మహిళలపై వేధింపుల నివారణకు అవగాహన కార్యక్రమాలు

డైలీ భారత్, కామారెడ్డి : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలు కామారెడ్డిలోని కిసాన్ షాపింగ్ మాల్, ఎల్లారెడ్డి మండలం సోమర్‌పేట్ గ్రామం మరియు బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించగా, సుమారు 330 మంది ప్రజలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది లింగ సమానత్వం, మహిళలపై వేధింపులు, సోషల్ మీడియా వేధింపులు, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై దాడులు, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, సైబర్ బులీయింగ్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

అలాగే షీ టీమ్ అంటే ఏమిటి, అది ఎలా పనిచేస్తుంది, మహిళలకు, బాలికలకు ఎలా ఉపయోగపడుతుంది, వేధింపులు ఎదురైనప్పుడు ఎలాంటి సహాయం అందిస్తుంది అనే విషయాలను వివరించారు.

అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100/112, చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం సంబంధిత హెల్ప్‌లైన్లను సంప్రదించాలని సూచించారు. అలాగే కామారెడ్డి షీ టీమ్ నంబర్ 8712686094 ద్వారా కూడా సహాయం పొందవచ్చని తెలిపారు.

మహిళలు, బాలికలు ఎలాంటి సమస్య ఎదురైనా నిర్భయంగా షీ టీమ్‌ను సంప్రదించాలని, వారి భద్రత కోసం షీ టీమ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు

Previous ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్‌మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Next "మానసిక వ్యాధులు"( సైకియాట్రిక్ డిసార్డర్స్)
ADVERTISEMENT