Posted on 2026-07-23 13:29:02
డైలీ భారత్, యాదాద్రి భువనగిరి:యాదగిరిగుట్టను ప్లాస్టిక్ రహిత పుణ్యక్షేత్రంగా మార్చాలని మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, మాజీ బ్రాహ్మణ సేవా వాహిని (BSV) యాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజుల పత్తిపాటి కోరారు.
ఆమె విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి దేవాలయ పరిరక్షణ ప్రతి భక్తుడి బాధ్యత అని అన్నారు. "మనం స్వామిని దర్శించుకోవడంతో పాటు కొండను కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ప్లాస్టిక్ బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లను యాద్రి కొండపైకి తీసుకురాకూడదు. బదులుగా పునర్వినియోగ సంచులను వాడి, శుభ్రమైన యాదాద్రిని భావితరాలకు అందిద్దాం" అని పిలుపునిచ్చారు.
"దేవాలయ పరిరక్షణే పరమ పూజ" అని ఆమె అన్నారు. తిరుమల కొండపై అమలు చేస్తున్న విధంగా యాదాద్రి కొండపై కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని వెంటనే విధించాలని దేవస్థాన కమిటీని కోరారు.
భక్తులు ఈ నిబంధనలను స్వచ్ఛందంగా పాటించి, యాద్రిని మరింత పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచాలని మంజుల పత్తిపాటి విజ్ఞప్తి చేశారు.
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >