Posted on 2026-06-06 18:46:35
టెన్త్,ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది పిల్లలకు జిల్లా ఎస్పీ ప్రశంసలు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించిన జిల్లా పోలీసు అధికారుల,సిబ్బంది పిల్లలను జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే శనివారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించారు.
ఈకార్యక్రమానికి మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది పిల్లలు,వారి తల్లిదండ్రులు హాజరుకగా,విద్యార్థుల కృషి, పట్టుదల, క్రమశిక్షణను ప్రశంసించి భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విజయాలు సాధించాలని ఎస్పీ ఆకాంక్షించారు.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... తన చిన్ననాటి జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదివానని, తన తల్లిదండ్రులు ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని నిరాశ చెందకుండా, లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. అలాగే పట్టుదల, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ప్రోత్సహించారు.
పోలీస్ శాఖలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకు సేవలు అందిస్తూ తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులు కష్టాన్ని గుర్తించాలని పిల్లలకు సూచించారు.జీవితంలో ఎల్లప్పుడూ పాఠాలను నేర్చుకుంటూనే ఉండాలని,ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలని తెలిపారు.మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకొవలని , దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈకార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని,విద్యార్థులకు ఎస్పీ మెమొంటోలతో పాటుగా బహుమతులు అందజేశారు.
తల్లీదండ్రుల కష్టాన్ని,భవిష్యత్తులో విద్యార్థులు సాధించాలనుకుంటున్న లక్ష్యాలను వివరిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకుగాను ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సి.ఐ లు, ఆర్.ఐ లు, ఎస్.ఐ లు, పోలీస్ అధికారులు పిల్లలు పాల్గొన్నారు.
ఎల్లన్నగర్ గ్రామంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెర... రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం
Posted On 2026-07-23 16:06:22
Readmore >
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల సాధన రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలి
Posted On 2026-07-23 16:04:59
Readmore >
వార్షిక తనిఖీల్లో భాగంగా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-23 15:59:08
Readmore >
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కామారెడ్డి జిల్లా పోలీసుల చర్యలు
Posted On 2026-07-23 15:56:26
Readmore >
నూతన యువతరం తో ఎమ్మార్పీఎస్ నూతన ఉద్యమ నిర్మాణప్రక్రియప్రారంభం
Posted On 2026-07-23 15:54:39
Readmore >
సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో "నాకా బంధీ"... వాహనాల తనిఖీ
Posted On 2026-07-23 14:52:41
Readmore >
తిరుమల తరహాలో యాదాద్రిపై ప్లాస్టిక్ నిషేధం విధించాలి : మంజుల పత్తిపాటి
Posted On 2026-07-23 13:29:02
Readmore >