| Daily భారత్
Logo




నవవధువు ఆత్మహత్య

News

Posted on 2026-05-17 15:02:19

Share: Share


నవవధువు ఆత్మహత్య

కాకినాడ జిల్లాలో విషాదం.. నవవధువు ఆత్మహత్య

డైలీ భారత్, కాకినాడ: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గోనేడు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నవవధువు సత్యంశెట్టి వెంకటలక్ష్మి(25) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపురం మండలం మర్లవ గ్రామానికి చెందిన గాది కోటేశ్వరరావుతో వెంకటలక్ష్మి వివాహం ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన జరిగింది. అయితే వివాహం జరిగి నెలరోజులు కూడా గడవకముందే ఆమె మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వెంకటలక్ష్మి ఆత్మహత్యకు భర్త, అత్తింటి వారి వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి తర్వాత నుంచి మానసికంగా వేధింపులకు గురిచేశారని వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కిర్లంపూడి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు సమాచారం. నవవధువు మృతి ఘటనతో గోనేడు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >