Posted on 2026-05-17 14:46:50
(ప్రేమలు వికసిస్థాయి- మనస్సులు పులకుస్థాయి- సమస్యలు సృష్టిస్థాయి)
(చదవండి ఇది మీకోసమే)
వ్యాస కర్త: ప్రముఖ సైకాలజిస్ట్ కె.పున్నంచందర్, సిరిసిల్ల ,TPA రాష్ట్ర ఉపాధ్యక్షుడు
(తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక వ్యాసం)
డైలీ భారత్ స్పెషల్: టీనేజ్ దశ అనేది మనిషి జీవితంలో అత్యంత సున్నితమైన మరియు భావోద్వేగపూరితమైన కాలం. ఈ వయస్సులో పిల్లలు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగ పరంగా ఎన్నో మార్పులను అనుభవిస్తారు. కొత్త ఆలోచనలు, ఆకర్షణలు, స్వేచ్ఛపై ఆసక్తి, ప్రేమపై ఊహలు ఈ దశలో సహజంగా ఏర్పడతాయి. ఈ భావోద్వేగ అనుభూతులనే చాలా మంది “టీనేజ్ లవ్”గా భావిస్తారు.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా, సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్నేహితుల ప్రభావం వల్ల టీనేజ్ ప్రేమ మరింత వేగంగా పెరుగుతోంది. అయితే ఈ వయస్సులో తీసుకునే నిర్ణయాలు చాలాసార్లు భావోద్వేగాల ఆధారంగానే ఉంటాయి. అందువల్ల పిల్లలు, తల్లిదండ్రులు, సమాజం ఈ అంశంపై సరైన అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.
"స్నేహితుల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యం"
టీనేజ్ పిల్లల ఆలోచనా విధానం పెద్దలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఈ వయస్సులో పిల్లలు తమ భావోద్వేగాలను ఎక్కువగా నమ్ముతారు. తమను ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే భావన కలుగుతుంది. స్నేహితుల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. తల్లిదండ్రుల సూచనలను నియంత్రణగా భావించే పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఆకర్షణను ప్రేమగా భావించడం, తాత్కాలిక భావోద్వేగాలను జీవిత నిర్ణయాలుగా మార్చడం, ప్రేమ కోసం చదువును నిర్లక్ష్యం చేయడం వంటి మార్పులు ఈ దశలో సాధారణంగా కనిపిస్తాయి.
"హార్మోన్లలో మార్పులు భావోద్వేగాలలో అలజడి"
టీనేజ్ దశలో శరీరంలో హార్మోన్ల మార్పులు వేగంగా జరుగుతాయి. Testosterone, Estrogen వంటి హార్మోన్లు భావోద్వేగాలను ప్రభావితం చేస్తాయి. ఈ మార్పుల వల్ల కోపం, ఆవేశం, ఆకర్షణ, భావోద్వేగ అస్థిరత, impulsive behaviour ఎక్కువగా కనిపిస్తాయి. "మెదడులో నిర్ణయాలు తీసుకునే భాగాలు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం" వల్ల టీనేజ్ పిల్లలు భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. "పరిపక్వత లేని వయస్సు, అన్ని తనకు తెలుసు అనే భ్రమలు, భావోద్వేగ నియంత్రణ లేని మనస్సు కల్సి టీనేజర్స్ ను ప్రేమ అనుకునే ఆకర్షణలోకి బలవంతంగా నెట్టేస్తున్నాయి".
"వైఫల్యంతో నిరాశ నిస్పృహలు"
ప్రేమ విఫలం అయినప్పుడు కొంతమంది పిల్లలు తీవ్ర నిరాశకు గురవుతారు. Anxiety, Depression, Self-harm ఆలోచనలు కూడా కొన్నిసార్లు కనిపించవచ్చు. అందువల్ల టీనేజ్ పిల్లల భావోద్వేగాలను తేలికగా తీసుకోవడం సరికాదు.
చాలా కుటుంబాల్లో ప్రేమ విషయం తెలిసిన వెంటనే కోపం, బెదిరింపులు, అవమానించడం, కొట్టడం వంటి చర్యలు జరుగుతుంటాయి. ఇవి పిల్లలను మరింత దూరం చేసే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడాలి. వారి భావాలను శాంతంగా వినాలి. ప్రేమను తప్పుగా కాకుండా ఒక భావోద్వేగ దశగా పిల్లలకు అర్థం చేయించాలి. భయపెట్టకుండా భవిష్యత్తు లక్ష్యాలు, చదువు, బాధ్యతల గురించి అవగాహన కల్పించాలి.
"ప్రేమతో మార్గనిర్దేశనం"
పిల్లలకు ఇంట్లోనే అర్థం చేసుకునే వాతావరణం లభిస్తే, బయట తప్పు దారుల్లో వెళ్లే అవకాశాలు తగ్గుతాయి. తల్లిదండ్రులు పిల్లలతో రోజూ మాట్లాడే అలవాటు పెంచుకోవాలి. సోషల్ మీడియా వినియోగం, స్నేహితుల ప్రభావం వంటి అంశాలను గమనిస్తూ ప్రేమతో మార్గనిర్దేశనం చేయాలి.
"ప్రేమ సమస్య నుండి బయటపడేసే విషయంలో సైకాలజిస్టుల పాత్ర"
టీనేజ్ ప్రేమలో అనేక సమస్యలు ఎదురవుతాయి. చదువుపై ఆసక్తి తగ్గడం, emotional dependency పెరగడం, కుటుంబ సభ్యులతో గొడవలు, అబద్ధాలు చెప్పడం, మొబైల్ వ్యసనం, మానసిక ఒత్తిడి వంటి పరిస్థితులు కనిపించవచ్చు. ప్రేమ విఫలం కావడం వల్ల కొందరు పిల్లలు జీవితంపైనే నమ్మకం కోల్పోయే స్థితికి చేరుకుంటారు. అలాంటి సమయంలో కుటుంబ సహకారం మరియు సైకాలజికల్ సహాయం చాలా అవసరం.
టీనేజ్ ప్రేమ సమస్యలను అర్థం చేసుకుని సరైన దారిలో నడిపించడంలో సైకాలజిస్టుల పాత్ర ఎంతో కీలకం. ప్రేమ మరియు ఆకర్షణ మధ్య తేడాను పిల్లలకు అర్థమయ్యేలా వివరిస్తారు. భావోద్వేగాలను నియంత్రించడం, తిరస్కరణను స్వీకరించడం, stress management నేర్పించడం వంటి అంశాల్లో సైకాలజిస్టులు సహాయం చేస్తారు. కొన్ని సందర్భాల్లో unhealthy relationships నుండి బయటపడడం, obsession తగ్గించడం, చదువు మరియు career పై మళ్లీ దృష్టి పెట్టించడం కోసం counselling అవసరం అవుతుంది.
"సైకాలజిస్టులు అందించే థెరపీలు"
సైకాలజిస్టులు వివిధ రకాల therapies ద్వారా పిల్లలకు సహాయం చేస్తారు. Cognitive Behaviour Therapy (CBT) ద్వారా నెగటివ్ ఆలోచనలను మార్చే ప్రయత్నం చేస్తారు. Behaviour Therapy ద్వారా అనవసర ప్రవర్తనలను తగ్గిస్తారు. Emotional Regulation Therapy ద్వారా కోపం, anxiety, బాధ వంటి భావోద్వేగాలను నియంత్రించడం నేర్పిస్తారు. Family Counselling ద్వారా తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అవగాహన పెంచుతారు. Supportive Therapy ద్వారా ప్రేమ విఫలం వల్ల కలిగే నిరాశను తగ్గించే ప్రయత్నం చేస్తారు. Motivational Therapy ద్వారా పిల్లల దృష్టిని చదువు, career, వ్యక్తిత్వ వికాసం వైపు మళ్లిస్తారు.
టీనేజ్ ప్రేమ అనేది చాలా సందర్భాల్లో భావోద్వేగాల ప్రభావంతో ఏర్పడే ఆకర్షణ మాత్రమే. ఈ దశలో పిల్లలను తప్పుపట్టడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యము.
తల్లిదండ్రుల ప్రేమ, సరైన మార్గదర్శనం, సైకాలజిస్టుల సహాయం ఉంటే పిల్లలు ఆరోగ్యకరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు పెరుగుతాయి.
ప్రేమ భావనలు టీనేజీలో రావడం సహజమే కానీ వాటిని అర్థం చేసుకొని అధిగమించడంలోనే పిల్లల జీవితం ముందుకు సాగుతుంది. టీనేజ్ పిల్లల భావాలను అర్థం చేసుకొని సరియైన దారిలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది.
భావోద్వేగాలను సమతుల్యంగా అర్థం చేసుకుని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం అవసరం. టీనేజ్ పిల్లలకు ప్రేమ కంటే ముందు వ్యక్తిత్వ వికాసం, విద్య, జీవిత లక్ష్యాలు ముఖ్యమని తెలియజేయాల్సిన అవసరం ఉంది.
తల్లిదండ్రులు మొహమాటం వదిలి సైకాలజిస్టులను కలిస్తే పిల్లల్లో జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, భవిష్యత్తును తీర్చిదిద్దుకునే విధానాలు, ఎమోషన్స్ ను సరైన రీతిలో ఎలా ప్రదర్శించాలో వారికి నేర్పిస్తారు.
సైకాలజిస్ట్ ఒక స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా, జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడిగా మీ పిల్లలను తీర్చిదిద్దుతారు.
Visit us:
Sanjana Clinic
(Neuro Psychiatric & Counseling Center)
Shiva nager khaman, Main Road, Sircilla
15+ years of Experience in Mental Health
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >