| Daily భారత్
Logo




ఫరీద్‌పేట్‌లో బాడీ మీటింగ్ బహిష్కరణ

News

Posted on 2026-05-14 15:22:34

Share: Share


ఫరీద్‌పేట్‌లో బాడీ మీటింగ్ బహిష్కరణ

సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు

డైలీ భారత్, కామారెడ్డి: ఫరీద్‌పేట్ గ్రామ పంచాయతీ బాడీ మీటింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగింది. గ్రామ నిధుల వినియోగంలో పారదర్శకత లేదని ఆరోపిస్తూ వార్డు సభ్యులు తగిరంచ రమాదేవి, దేవోల్ల ప్రత్యూష, జ్యోతి,  వెంకట్ స్వామి గౌడ్, నర్సింలు, సమావేశాన్ని మధ్యలోనే బహిష్కరించారు.

బాడీ తీర్మానం లేకుండా, వార్డు సభ్యులకు సమాచారం ఇవ్వకుండా భారీ మొత్తంలో బిల్లులు తీసుకున్నారాని వార్డు సభ్యులు ఆరోపించారు. ముఖ్యంగా కేవలం నాలుగు నెలల్లోనే ₹11 లక్షల వరకు బిల్లులు తీసుకున్నారాని, కానీ పాత పెండింగ్ బిల్లులు ఇంకా క్లియర్ చేయలేదని మండిపడ్డారు.

సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ వార్డు సభ్యులకు చెప్పకుండా, తీర్మానం లేకుండా డబ్బులు ఎలా తీశావని మరియు నీ సొంత నిర్ణయాలు, వ్యవహారాలు చూసి ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని డిమాండ్ చేశారు. అయితే సర్పంచ్ జీడిపల్లి నర్సింహ రెడ్డి మరియు ఉపసర్పంచ్ నుండి సరైన సమాధానాలు రాకపోవడంతో సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

● 2026లో తీసుకున్న బిల్లులకు  2023, 2024 జియో - ట్యాగ్ ఫొటోలు ఎందుకు ఉన్నాయి? పాత పనులను కొత్త పనులుగా చూపించారా? అంటూ సభ్యులు నిలదీశారు.

● మేము పాత బకాయిలు చెల్లించాలని కోరినప్పుడు, సర్పంచ్ గారు "నేను 30 లక్షలు ఖర్చు పెట్టి గెలిచాను… అందరికీ ఇస్తూ పోతే నాకు ఏమి మిగులుతుంది" అని మాట్లాడటం మాకు తీవ్ర బాధ కలిగించింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా, పంచాయతీ కార్యాలయానికి వెళ్లినప్పుడు వార్డు సభ్యుల ఫోన్లు తీసుకుని పక్కన పెట్టిన, తర్వాత మాట్లాడండి అని చెప్పడం ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా ఉందని ఆరోపించారు.

● పాత బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదు

● కానీ ఎంపిక చేసుకుని కొంతమందికి మాత్రమే బిల్లులు క్లియర్ చేస్తున్నారని సభ్యులు మండిపడ్డారు.

ఈ సందర్భంగా సభ్యులు మీడియాతో మాట్లాడుతూ:

గ్రామ ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు. కానీ ఇప్పుడు గ్రామంలో జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలు చూసి ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. గ్రామ ప్రజల డబ్బుపై సృష్టత లేకపోవడం చాలా బాధాకరం. గ్రామంలో జరుగుతున్న కొన్ని నిర్ణయాలు చూసి మేమే ప్రజల ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది అని భావోద్వేగానికి గురయ్యారు.

సర్పంచ్ నర్సింహారెడ్డి గతంలో BRS పార్టీలో వైస్ ఎంపీపీగా, ఇంచార్జ్ ఎంపీపీగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఆరోపణలు రావడం ఇప్పుడు గ్రామ ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోందని పేర్కొన్నారు.

ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ  వార్డు సభ్యులను పట్టించుకోకుండా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అని మండిపడ్డారు.

 అవసరమైతే తదుపరి రాజకీయ నిర్ణయాలు కూడా తీసుకుంటామని వార్డు సభ్యులు హెచ్చరించారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >