| Daily భారత్
Logo




"మానసిక ఆందోళన...ఇక భయం లేదు" (Anxiety) (మీ కోసమే మేమున్నాం)

News

Posted on 2026-05-14 18:59:23

Share: Share


"మానసిక ఆందోళన...ఇక భయం లేదు" (Anxiety)  (మీ కోసమే మేమున్నాం)

వ్యాస కర్త: ప్రముఖ సైకాలజిస్ట్ కె.పున్నంచందర్, సిరిసిల్ల TPA రాష్ట్ర ఉపాధ్యక్షుడు 

(తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

డైలీ భారత్ స్పెషల్: ప్రస్తుత సమాజంలో వేగంగా మారుతున్న జీవన విధానం, పెరుగుతున్న పోటీ ప్రపంచం, కుటుంబ మరియు ఆర్థిక ఒత్తిడులు, ఉద్యోగ సమస్యలు, సంబంధాలలో విభేదాలు, విద్యాపరమైన ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చాలా మంది ఆందోళన (Anxiety) సమస్యతో బాధపడుతున్నారు. 

కొంతమేర ఆందోళన ప్రతి మనిషిలో సహజమే. పరీక్షలు, ఇంటర్వ్యూలు, కొత్త బాధ్యతలు వంటి సందర్భాల్లో కలిగే టెన్షన్ సాధారణమైనదే. అయితే అదే ఆందోళన అధికమై, వ్యక్తి రోజువారీ జీవనాన్ని ప్రభావితం చేస్తే అది మానసిక ఆరోగ్య సమస్యగా మారుతుంది.

ఆందోళన అనేది వ్యక్తిలో భయం, అసహనం, తెలియని ప్రమాదం ఉన్నట్లుగా అనిపించడం, నిరంతరం టెన్షన్ మరియు భయంతో జీవించడం వంటి భావోద్వేగ స్థితి. చాలా మంది దీనిని సాధారణ ఒత్తిడిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ దీర్ఘకాలంగా కొనసాగితే ఇది వ్యక్తి మానసిక, శారీరక మరియు సామాజిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

"ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తుల్లో లక్షణాలు"

ఎప్పుడూ ఏదో చెడు జరుగుతుందనే భయం, చిన్న విషయానికే అధికంగా టెన్షన్ పడటం, ఎక్కువగా ఆలోచించడం, ఏకాగ్రత తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పడటం, చేతులు వణకడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిద్రలేమి, అలసట, తలనొప్పి వంటి శారీరక లక్షణాలు కూడా ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో Panic Attacks రావచ్చు. ఈ పరిస్థితుల్లో వ్యక్తి ఒంటరిగా ఉండాలని భావించడం, ఇతరులతో కలవడానికి భయపడటం, పనులపై ఆసక్తి కోల్పోవడం వంటి మార్పులు కనిపిస్తాయి.

"ఆందోళన ఒకే విధంగా ఉండదు"

 వ్యక్తి పరిస్థితులు, ఆలోచనలు, భయాల ఆధారంగా వివిధ రకాల Anxiety Disorders కనిపిస్తాయి. Generalized Anxiety Disorder (GAD) లో వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒక విషయంపై అధికంగా ఆందోళన చెందుతుంటారు. చిన్న విషయానికే భయపడటం, భవిష్యత్తుపై అనవసర ఆలోచనలు చేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. Panic Disorder లో ఒక్కసారిగా తీవ్రమైన భయం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి Panic Attacks వస్తాయి. Social Anxiety Disorder లో ఇతరుల ముందు మాట్లాడేందుకు లేదా సామాజిక పరిస్థితుల్లో పాల్గొనేందుకు తీవ్ర భయం కలుగుతుంది.

కొంతమందిలో ప్రత్యేక విషయాలపై లేదా పరిస్థితులపై అధిక భయం కనిపిస్తుంది. దీనిని Phobia అంటారు. ఎత్తులు, చీకటి, నీరు, జంతువులు, ప్రయాణం వంటి వాటిపై అసాధారణ భయం ఉండవచ్చు. అలాగే Obsessive Compulsive Disorder (OCD) లో వ్యక్తికి మళ్లీ మళ్లీ వచ్చే ఆలోచనలు మరియు వాటిని తగ్గించేందుకు పునరావృత ప్రవర్తనలు కనిపిస్తాయి. ఉదాహరణకు చేతులు పదే పదే కడుక్కోవడం, తలుపులు మళ్లీ మళ్లీ చెక్ చేయడం వంటి లక్షణాలు ఉంటాయి. ప్రమాదాలు, హింసాత్మక సంఘటనలు లేదా తీవ్రమైన ట్రామా తరువాత కనిపించే భయాన్ని Post Traumatic Stress Disorder (PTSD) అంటారు. ఈ పరిస్థితిలో వ్యక్తికి గత సంఘటనలు మళ్లీ గుర్తుకు వస్తూ భయం మరియు ఆందోళన పెరుగుతుంటాయి.

"ఆందోళనకు కారణాలు"

ఆందోళనకు కుటుంబ కలహాలు, దాంపత్య సమస్యలు, ఉద్యోగ ఒత్తిడి, పరీక్షల భయం, చిన్ననాటి ట్రామా, ఆర్థిక ఇబ్బందులు, సంబంధాలలో విభేదాలు, మద్యపానం మరియు మత్తు పదార్థాల వినియోగం వంటి అనేక కారణాలు ఉంటాయి. అదేవిధంగా నెగిటివ్ ఆలోచనలు, అధిక భావోద్వేగ స్పందనలు మరియు భవిష్యత్తుపై భయం కూడా Anxiety పెరగడానికి కారణమవుతాయి.

"తొలిదశలోనే గుర్తించి సరైన చికిత్స పొందాలి"

ఆందోళనకు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. చికిత్సలో కౌన్సెలింగ్, సైకాలజికల్ థెరపీలు, జీవనశైలి మార్పులు మరియు అవసరమైతే మందులు కూడా ఉపయోగపడతాయి. ముఖ్యంగా Cognitive Behaviour Therapy (CBT) Anxiety చికిత్సలో అత్యంత ప్రభావవంతమైన థెరపీగా గుర్తించబడింది. ఈ థెరపీ ద్వారా వ్యక్తిలో ఉన్న నెగిటివ్ ఆలోచనలను గుర్తించి వాటిని సానుకూల ఆలోచనలుగా మార్చేందుకు సహాయం చేస్తారు. అలాగే Relaxation Techniques, Deep Breathing, Meditation, Mindfulness వంటి పద్ధతులు మానసిక ప్రశాంతతను పెంచుతాయి.

జీవనశైలిలో మార్పులు కూడా Anxiety తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. సరైన నిద్ర, వ్యాయామం, సమతుల ఆహారం, సమయపాలన, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించడం వంటి అలవాట్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొన్ని తీవ్రమైన పరిస్థితుల్లో సైకియాట్రిస్ట్ మందులు సూచించవచ్చు. అయితే "మందులతో పాటు కౌన్సెలింగ్ మరియు థెరపీ తీసుకుంటే" మంచి ఫలితాలు కనిపిస్తాయి.

"సైకాలజిస్టులది ప్రధాన పాత్ర"

ఆందోళన సమస్యల చికిత్సలో సైకాలజిస్టుల పాత్ర అత్యంత కీలకం. సైకాలజిస్టులు వ్యక్తి భావోద్వేగాలను అర్థం చేసుకొని, సమస్యల మూలకారణాలను గుర్తించి, సరైన థెరపీ ద్వారా మానసిక స్థిరత్వాన్ని కల్పిస్తారు. వారు వ్యక్తికి ఒత్తిడిని నియంత్రించే పద్ధతులు నేర్పించడం మాత్రమే కాకుండా, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు కూడా సహాయం చేస్తారు. కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పిస్తూ, రోగికి మద్దతు ఇవ్వడానికి మార్గనిర్దేశనం చేస్తారు.

ప్రస్తుతం సమాజంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెరగడం చాలా అవసరం.

 Anxiety అనేది బలహీనత కాదు, అది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సమస్యలను దాచుకోవడం కాకుండా, సమయానికి నిపుణులను సంప్రదించడం ఎంతో ముఖ్యమైనది. కుటుంబ మద్దతు, సమాజ సహకారం మరియు సైకాలజిస్టుల సేవల ద్వారా ఆందోళన నుండి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని గడపడం సాధ్యమే.

ఆందోళన సహజమే...దాని పరిణామాలు అసహజం.


– సైకాలజిస్ట్ కె. పున్నంచందర్, సిరిసిల్ల

M.Sc Psychology, MSW (Medical & Psychiatry), LLB

15+ Years Experience in Mental Health


Visit us: Sanjana Clinic 

(Neuro Psychiatric & Counseling Center), Shiva nager Khaman, Kamareddy Main Road, Sircilla, Rajanna Sircilla Dist.

Image 1

క్షుద్ర పూజల పేరుతో 54 గ్రాముల బంగారం అపహరణ

Posted On 2026-05-15 10:30:52

Readmore >
Image 1

ఏసీబీ వలలో ఆర్ఐ

Posted On 2026-05-14 20:16:30

Readmore >
Image 1

ప్రకృతిని కాపాడు : మంజుల పత్తిపాటి

Posted On 2026-05-14 19:43:09

Readmore >
Image 1

"మానసిక ఆందోళన...ఇక భయం లేదు" (Anxiety) (మీ కోసమే మేమున్నాం)

Posted On 2026-05-14 18:59:23

Readmore >
Image 1

ఫరీద్‌పేట్‌లో బాడీ మీటింగ్ బహిష్కరణ

Posted On 2026-05-14 18:52:34

Readmore >
Image 1

బక్రీద్ పండుగకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు – 24/7 జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Posted On 2026-05-14 18:50:21

Readmore >
Image 1

కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్‌

Posted On 2026-05-14 18:46:05

Readmore >
Image 1

ఎడవల్లి కృష్ణ నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షులు తెలిపిన రాయల శాంతయ్య మరియు నాయకులు

Posted On 2026-05-14 18:45:13

Readmore >
Image 1

బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు..

Posted On 2026-05-14 18:44:01

Readmore >
Image 1

కబేళాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 122 పశువులు పట్టివేత, ఒక లారీ సీజ్ చేసిన చంద్రుగొండ పోలీసులు

Posted On 2026-05-14 08:26:36

Readmore >