Posted on 2026-04-23 13:26:02
డైలీ భారత్, నర్సంపేట: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య వరంగల్ జిల్లాలో సంచలన ఘటన చోటుచేసుకుంది. నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ శంకర్ గౌడ్ తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
సమ్మె నేపథ్యంలో ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ, ఆయన తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన సహచరులు మరియు స్థానికులు వెంటనే స్పందించి ఆయనను అడ్డుకొని ప్రాణాపాయం నుంచి కాపాడారు.
తీవ్ర గాయాలపాలైన శంకర్ గౌడ్‌ను వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.
ఈ ఘటనతో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. సమ్మె కొనసాగుతున్న సమయంలో ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
#warangal #suicide #rtc #rtc strike #rtc driver #narsampeta
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >