| Daily భారత్
Logo




ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

News

Posted on 2026-07-14 12:02:32

Share: Share


ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

నిందితుల నుండి లక్ష యాభై వేల రూపాయల విలువ చేసే గంజాయి స్వాధీనం

సత్తుపల్లి రూరల్ సిఐ ముత్తులింగం

డైలీ భారత్, ఖమ్మం జిల్లా: గంజాయి మత్తుకు అలవాటు పడి, సరఫరా చేస్తున్న కల్లూరు పట్టణానికి చెందిన షేక్ హబీబ్, బొడ్డు చందులు, మణుగూరు కు చెందిన తేజావత్ రమేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సత్తుపల్లి రూరల్ సిఐ ముత్తులింగం  తెలిపారు. 

గత ఏడాది 2025లో షేక్ హబీబ్ అనే నిందితుడు స్నేహితులతో కలిసి ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి వెళ్లి సన్నీ అనే వ్యక్తి దగ్గర నుండి గంజాయి కొనుగోలు చేసి కల్లూరులో చిన్న ప్యాకెట్లుగా చేసి త్రాగే అలవాటు ఉన్నవారికి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని  కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించరాని తెలిపారు. 

జైలు నుంచి విడుదలైన తర్వాత హబీబ్ కొద్దికాలం బాగానే ఉంటూ కల్లూరులోని ఒక రెస్టారెంట్లో పనిచేశాడని, ఇటీవల ఎటువంటి పని లేకపోవడంతో మణుగూరు అత్తగారింటికి వెళ్ళినప్పుడు పాత స్నేహితుడైన తేజావత్ రమేష్ కలువగా కలిసి ఇరువురు గంజాయి సేవించారని, దాంతో మరల అలవాటు పడి, కల్లూరు వచ్చిన తర్వాత గంజాయి కోసం బొడ్డు చందు ని సంప్రదించగా చందు కొద్దిమొత్తంలో 500 రూపాయలకు ముద్దునూరు లో తెచ్చి ఇచ్చాడని, కానీ ధర ఎక్కువగా ఉండడం, గంజాయి తక్కువ రావడంతో హబీబ్, చందులు మరల ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి కి జులై 7 న వెళ్లినారని, అలా వెళ్ళుటకు వాహనం ఏర్పాటు చేసినందుకు తేజవత్ రమేష్ గంజాయిలో వాటా అడగటంతో 500 గ్రాములు తేజవత్ రమేష్ కి ఇచ్చారని తెలిపారు. కల్లూరు వచ్చిన తర్వాత అట్టి గంజాయిని అమ్ముటకు చందు ద్వారా పేరవంచ గ్రామానికి చెందిన ప్రవీణ్, చిన్న ప్రవీణ్, హరీష్ లను సంప్రదించగా వారు ఒప్పుకున్నారని, దాంతో తేజావత్ రమేష్ దగ్గర ఉన్న అరకేజీ కూడా తెప్పించి, ముగ్గురు కలిసి మొత్తం మూడు కేజీలు అమ్మి మల్కనగిరి వెళ్లి మరలా పెద్ద మొత్తంలో లాభాల దురుద్దేశంతో హబీబ్, చందు, రమేష్ లు జులై 13 న బండిపై పేరువంచ వెళ్లుచుండగా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వాహనాలు తనిఖీలో గంజాయితో పోలీసు పట్టుకున్నారని తెలిపారు. 

ఇట్టి గంజాయి విలువ ఒక కేజీ రూ 50 వేలు చొప్పున మొత్తం మూడు KG లు రూ 1,50,000 ఉంటుందని తెలిపారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. 

ఈ కేసు దర్యాప్తులో లో SI హరిత, హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు, లక్ష్మీపతిలు,  కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, సత్యనారాయణ, రఫీ, విజయ్, రంగారావు లు సహకరించినందున అబినందించారు.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >