Posted on 2026-07-14 13:24:05
టింబర్ సంఘ భవన నిధుల కోసం హామీ
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సామిల్ టింబర్ మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వాజిద్ ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా కట్టె కోత మిషన్ల యజమానుల సంఘానికి సంఘ భవన నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తానని ప్రభుత్వ సలహాదారులు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా సామిల్ టింబర్ మర్చంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా వాజిద్ జషీన్ ను, టింబర్ మర్చంట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ సన్మానించారు. స్థలం చూపితే భవన నిర్మాణానికి కృషి చేస్తానని నిధులు మంజూరు చేస్తానని
సామిల్ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హామీ ఇచ్చారు. కట్టెకోత మిల్లుల యజమానుల సంఘ సమస్యల పరిష్కరించడానికి అటవీ శాఖ అధికారులతో మాట్లాడి పరిష్కరింప చేస్తానని సంఘ ప్రతినిధులకు షబ్బీర్ భరోసా ఇచ్చారు. సా మిల్ యజమానులు ప్రభుత్వం నిబంధనల మేరకు నడుచుకోవాలని సంఘ ప్రతినిధులకు ప్రభుత్వ సలహాదారులు సూచించారు. కామారెడ్డి జిల్లాలో 55 మంది టింబర్ మర్చంట్ లు ఉన్నారని వారి సమస్యలను పరిష్కారానికి చొరవ చూపాలని, ప్రభుత్వంతో మాట్లాడాలని, అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేయాలని సామి యజమానులు షబ్బీర్ కు విన్నవించారు. జిల్లాలోని ఎల్లారెడ్డి దోమకొండ బాన్సువాడ బిచ్కుంద ప్రాంతాలలో టింబర్ మర్చంట్ల సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరింపజేయాలని ప్రభుత్వానికి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ను సామిల్లుల యజమానులు కోరారు. తనను కామారెడ్డి టింబర్ మర్చంట్ల సంఘ అధ్యక్షులు గా ఎన్నుకున్నందుకు వాజిద్ జిల్లాలోని సామిల్ యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ సన్మానించిన వారిలో కామారెడ్డి జిల్లా టింబర్ మర్చంట్ల సంఘం అధ్యక్షులు వాజిద్ జషీన్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షులు నవీద్, కోశాధికారి తమీమ్ అహ్మద్, ఉపాధ్యక్షులు సందీప్ కుమార్, ప్రధాన కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఆజం ఖాన్, శ్రీధర్, కాంతిలాల్ పటేల్, సలహాదారులు బి సుదర్శన్ తదితరులు ఉన్నారు.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >