| Daily భారత్
Logo




ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

News

Posted on 2026-07-14 11:38:49

Share: Share


ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

డైలీ భారత్, వినుకొండ:కుటుంబ కలహాలు పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. క్షణికావేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇద్దరు పసిపిల్లల ప్రాణాలను బలిగొనడంతో పాటు ఒక తల్లి బలవన్మరణానికి కారణమైంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన నక్కా భారతి (24) కి, పాల వ్యాన్ డ్రైవర్‌గా పనిచేసే సునీల్ రెడ్డితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తేజేష్ రెడ్డి (6), హేమనాథ నాగిరెడ్డి (4) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, గత కొంతకాలంగా భర్త వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో దంపతుల మధ్య తరచూ తీవ్రమైన గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన భారతి.. సోమవారం రాత్రి భర్త డ్యూటీకి వెళ్ళిన తర్వాత దారుణానికి ఒడిగట్టింది. తన ఇద్దరు బిడ్డలకు ఆహారంలో విషం ఇచ్చి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం ఉదయం ఇరుగుపొరుగు వారు గమనించేసరికి ముగ్గురూ నిర్జీవంగా పడి ఉన్నారు.

ఘటనా స్థలంలో భారతి రాసిన ఒక చిన్న ఆత్మహత్య లేఖ లభ్యమైంది. తన చావుకు ఎవరూ బాధ్యులు కారని ఆమె అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వినుకొండ రూరల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >