Posted on 2026-07-14 03:38:14
డైలీ భారత్ డెస్క్: పల్లెటూర్లో ప్రజలు ముఖ్యంగా రైతులకు ఎదురయ్యే ప్రమాదాల్లో ప్రముఖమైనది పాము కాటు.
మన ప్రాంతాల్లో ఉండే అత్యంత విషసర్పాల్లో ప్రముఖంగా మూడు రకాలే ఎక్కువగా మనకు ఎదురవుతుంటాయి.
తాచు పాము, రక్తపింజరి, కట్లపాము, ఈ మూడింటి కాట్లే మనిషి ప్రాణాలను తీస్తుంటాయి.
పాము కాటు వేసిన గంటలోపే ఆసుపత్రులకు వెళ్తే ప్రాణాలను కాపాడుకునే అవకాశం ఉంటుంది.
ఇలాంటి సందర్భాల్లో మారు మూల గ్రామాల ప్రజలు సరైన సమయంలో ఆసుపత్రులకు వెళ్ల లేక ప్రాణాలు కోల్పోతుంటారు.
వారి కోసం ప్రభుత్వం ఇక పై 108 లోను పాముకాటుకు ఇంజక్షన్లు ఉంచింది.
ప్రభుత్వం చేసిన ఈ కొత్త ఆలోచనతో ఎంతోమంది రైతులు, ప్రజలు సకాలంలో ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది.
ఎవరికి ఏ సమయంలో ప్రమాదం జరిగిన,సమాచారం అందుకున్న కొద్ది సమయం లోనే 108 వాహనం అక్కడ ఉంటుంది.
ఈ 108 కు ఎక్కువగా యాక్సిడెంట్ కేసులే వస్తుంటాయి.
దానికి సంబంధించిన మందులే అందులో ఉంటాయి.
అత్యవసర చికిత్సలు చేసేందుకు అనుకూలమైన విధంగా 108 వాహనాలను సిద్ధం చేశారు.
ఇక పై 108 లో పాము కాటు కు సంబంధించిన ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >