Posted on 2026-07-13 18:18:22
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
డైలీ భారత్, కామారెడ్డి: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 114 దరఖాస్తులను స్వీకరించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులను కలెక్టర్ స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు.
అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
అనంతరం పెండింగ్ దరఖాస్తుల పై ఆరా తీశారు. తహసీల్దార్ లు, ఆయా శాఖల అధికారులు ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులతో పాటు, ఆయా సంక్షేమ, అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని,
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండరాదని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, NV గిరి, పీడీసీ రవితేజ, DRO పాండు, జిల్లా స్థాయి అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >