డైలీ భారత్, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైసీపీ ముఖ్య నాయకుడు బొత్స సత్య నారాయణను తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ (బి.వి.ఆర్) కలుసుకున్నారు. శుక్రవారం ఉదయం సిరిపురంలోని బొత్స నివాసంలో ఇరువురు భేటీ అయ్యారు . ఇటీవల కాలంలో బొత్స ఆరోగ్యం కాస్త మందగించిన నేపథ్యంలో ఈ భేటీ కొనసాగింది. ప్రస్తుతం మీ ఆరోగ్యం ఎలా ఉందని, ఏది ఏమైనా మంచి ఆరోగ్యంతో ఉండాలని బివిఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో.. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందిన బొత్స సత్యనారాయణకు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ తండ్రి దివంగత బి.వి.రామారావుతో కూడా మంచి అనుబంధం ఉండేది. ఇదే విషయాన్ని బొత్స మరోసారి గుర్తు చేసుకున్నారు.
News
బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ