డైలీ భారత్, గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. మహిళల 51 కేజీల విభాగంలో సాక్షి చౌదరి స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో రూబీ వైట్ (ఇంగ్లాండ్) ను సాక్షి 5-0 తేడాతో మట్టికరిపించి విజేతగా నిలిచింది. ఆ తర్వాత మహిళల 60 కేజీల విభాగంలో ప్రియా ఘంఘాస్ కూడా బంగారు పతకం సాధించింది. ఫైనల్లో కెనడాకు చెందిన మేరీ అల్-అహ్మదీహ్ 4-1తో తేడాతో ఓడించి స్వర్ణం ఎగరేసుకుపోయింది.
మహిళల 70 కేజీల విభాగం ఫైనల్లో అరుంధతి చౌదరి స్వర్ణం గెల్చుకుంది. ఇంగ్లాండ్కు చెందిన చాంటెల్ రీడ్ పై అరుంధతి 5-0 తేడాతో విజయం సాధించింది. దీంతో బాక్సింగ్ లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటికే ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా పసిడి పతకాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గో హైయిన్ (Lovlina Borgohain) రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఎమ్మా సూ గ్రీన్ట్రీ (ఆస్ట్రేలియా) చేతిలో లవ్లీనా ఓడింది. జూడోలో మహిళల 63 కేజీల విభాగంలో స్కై నోస్టర్ (సౌతాఫ్రికా)ను ఓడించి ఉన్నతి శర్మ కాంస్య పతకం సొంతం చేసుకుంది.
భారత్ ఓవరాల్ గా ఇప్పటివరకు 11 స్వర్ణాలు, 16 రజతాలు, 8 కాంస్య పతకాలు సాధించి మెడల్స్ టాలీలో నాలుగో స్థానానికి దూసుకొచ్చింది.