| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం రేపల్లెవాడ - గానుగపాడు గ్రామల మధ్యలో ఉన్న ఎదుళ్ళ వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై శివరామకృష్ణ  మాట్లాడుతూ అనుమతులు లేకుండా రేపల్లెవాడ గ్రామంలోని ఎదుళ్ళ వాగు నుంచి ఇసుకను రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే ఇద్దరు డ్రైవర్ల పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా  ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Previous బొత్స తో తెలుగుశక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ భేటీ
Next డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
ADVERTISEMENT