| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

డైలీ భారత్, నర్సంపేట: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచిన యోధుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మృతి పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

సుదర్శన్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరాడి గెలిచి తిరిగి వస్తారని మనమందరం ఎదురుచూశామని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త బాధాకరమన్నారు.

తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి అగ్రభాగాన నిలిచి పోరాడారని,పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, నర్సంపేట నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిరంతరం కృషి చేశారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.

ఆయన అకాల మృతి పార్టీకి, నర్సంపేట నియోజకవర్గానికి, తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు. పెద్ది తనకు ఆప్త మిత్రుడు అని,సన్నిహితులని,ఆయన మరణం పట్ల ఎంపీ రవిచంద్ర తీవ్ర సంతాపం ప్రకటించారు.

సుదర్శన్  రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులకు ఎంపీ వద్దిరాజు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

పెద్ది ఇక లేరనే విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఎంపీ రవిచంద్ర కోరుకున్నారు.

Previous లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Next నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
ADVERTISEMENT