డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధంలేని వారు విద్యుత్ ప్రమాదంలో చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.5లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ TGSPDCL నిర్ణయం తీసుకుంది. ఇది ఈ ఏడాది APR 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇందులో రూ.7.20లక్షలు వారసుల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, రూ.80వేల నగదును చేతికిస్తారు. ఆవులు/గేదెలు/దున్నపోతులు చనిపోతే రూ.40వేలు, గొర్రెలు/మేకలు చనిపోతే రూ.7వేల పరిహారం ఇస్తారు.
News
కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు