ఎంఈఓ కార్యాలయ సిబ్బందికి ఏఐఎస్ఎఫ్ వినతి
విద్యాసంస్థల లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ
డైలీ భారత్, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు యూనిఫామ్ అందజే చేయాలని చెప్పి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నాయకులు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం లో (వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రారంభమై దాదాపు 45 రోజులు గడుస్తున్న ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయకపోవడం ఏంటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించారు. అదేవిధంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పందించి రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వ విద్యను నిర్మించడం చేస్తూ ఈ రాష్ట్రంలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలకు పెంచి పోషించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేసిందని చెప్పారు ఆరోపించారు. తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. తక్షణమే యూనిఫామ్స్ అందజేయాలి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుగులోతు అనిల్, కుమార్ బానోతు బాలాజీ ,అఖిల్ తదితరులు పాల్గొన్నారు