| Daily భారత్
Logo




మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

News

Posted on 2026-07-31 14:29:33

Share: Share


మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

డైలీ భారత్, న్యూఢిల్లీ / భద్రాద్రి కొత్తగూడెం: తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం, దుద్దుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మేరీమాత ఆలయం పరిసర ప్రాంతాల్లో స్టోన్ క్రషర్ మరియు గ్రానైట్ ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల ఏర్పడుతున్న వాయు కాలుష్యంపై డా. మద్దిశెట్టి సామేలు జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), న్యూఢిల్లీకి సమర్పించిన ఫిర్యాదుపై కమిషన్ స్పందించింది.

ఈ ఫిర్యాదును పరిశీలించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), కేసు నం. 8121/15/2026 కింద నమోదు చేసి, 30-07-2026 తేదీన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) చైర్మన్‌కు తదుపరి విచారణ, తగిన చర్యల కోసం అధికారికంగా పంపించింది.

ఫిర్యాదులో, మేరీమాత ఆలయం పరిసర ప్రాంతాల్లో స్టోన్ క్రషర్, గ్రానైట్ యూనిట్ల కార్యకలాపాల వల్ల భారీగా దుమ్ము, ధూళి వ్యాపించి ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, చర్మవ్యాధులు పెరుగుతున్నాయని, రహదారి పక్కన ఉన్న చెట్లు దుమ్ముతో కప్పబడి వాటి పెరుగుదల దెబ్బతింటోందని, వ్యవసాయ పంటలు కూడా నష్టపోతున్నాయని ఫిర్యాదులో వివరించారు.

ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాంతంలో తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, కాలుష్యానికి కారణమవుతున్న యూనిట్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కఠిన నియంత్రణ చర్యలు లేదా కార్యకలాపాల నిలిపివేతను కూడా పరిశీలించాలని డా. మద్దిశెట్టి సామేలు కోరారు.

జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఎనిమిది వారాల్లో తగిన చర్యలు తీసుకొని, చేపట్టిన చర్యలపై కమిషన్‌తో పాటు ఫిర్యాదుదారునికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ మరియు భక్తుల భద్రత దృష్ట్యా సంబంధిత అధికారులు ఈ అంశంపై వేగంగా స్పందించి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని డా. మద్దిశెట్టి సామేలు విజ్ఞప్తి చేశారు.

Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Posted On 2026-07-31 12:28:25

Readmore >
Image 1

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

Posted On 2026-07-31 07:29:30

Readmore >
Image 1

మహారాష్ట్రలో మరో భవన ప్రమాదం... భివండిలో అర్ధరాత్రి కూలిన అపార్ట్‌మెంట్

Posted On 2026-07-31 07:06:38

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >