| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా హిందీ కవి మున్షీ ప్రేమచంద్ జయంతి నిర్వహణ

ఘనంగా హిందీ కవి మున్షీ ప్రేమచంద్ జయంతి  నిర్వహణ

డైలీ భారత్, సిరిసిల్ల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంబేద్కర్ నగర్, సిరిసిల్లలో హిందీ సాహిత్య జగత్తుకు విశిష్ట సేవలందించిన ఉపన్యాస సమ్రాట్ మున్షీ ప్రేమచంద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

హిందీ ఉపాధ్యాయులు పర్కాల రవీందర్ మాట్లాడుతూ, ప్రేమచంద్ తన కథలు, నవలల ద్వారా సమాజంలోని పేదరికం, అసమానతలు, రైతుల జీవన విధానం, సామాజిక న్యాయం వంటి అంశాలను వాస్తవికంగా చిత్రించి హిందీ సాహిత్యానికి చిరస్మరణీయ సేవలందించారని తెలిపారు. ఆయన రచనలు నేటికీ విద్యార్థులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రేమచంద్ సాహిత్య స్ఫూర్తిని ప్రతి విద్యార్థి జీవితంలో ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

జయంతి సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సామల రాజీవ్, విశ్వతేజ, M. అభిరామ్ లకు బహుమతులు అందజేసి అభినందించారు. 

ఈ కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు నాగుల రమాదేవి, ఉపాధ్యాయులు పొలాస మల్లేశం, ఐత సత్యనారాయణ, సామాల రమాదేవి, సిరిపురం జ్యోతి, జంగిటి భానుచందర్, చొప్పదండి రమాదేవి  మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Previous మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన
Next నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
ADVERTISEMENT