| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్

అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు శ్రీమతి పావని గౌడ్  బిజి కొత్తూరు పరిధిలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్‌ను సందర్శించారుతెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు  కేసీఆర్  ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో సీతారామ ప్రాజెక్ట్ ఒకటని ఆమె పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించి రైతాంగ అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పారు. అనంతరం స్థానిక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష&కార్యదర్శి కోడి అమరేందర్ యాదవ్_మర్రి మల్లారెడ్డి  మాట్లాడుతూసీతారామ ప్రాజెక్ట్ (పంప్ హౌస్ ) ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు తెలంగాణ రైతులందరికి సాగునీ రు అందించి సస్యశ్యామలం చేయడం చాలా ఆనందదాయకం అని అన్నారు...అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి రైతులకు గోదావరి జలాలతో  చివరి ఎకరం తడిసే వరకు BRS  పోరాటం కొనసాగుతుందని వారు తెలియజేశారు అమలు గాని 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పరిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజానీకం సరైన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి,సీనియర్ నాయకుడు జాలే రామకృష్ణారెడ్డి,సర్పంచులు మర్రి సంధ్య,కోర్స అలివేలు,మండ్రు రామకృష్ణ,కోండ్రు సోమయ్య,మాజీ సర్పంచ్ కోడి కృష్ణవేణి,మండల యువజన విభాగం అధ్యక్షుడు గద్దల రామకృష్ణ,మండల SC సెల్ అధ్యక్షులు& ఉప సర్పంచ్ చల్లా రాజేష్,మండల బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివారపు డాక్టర్ బాబు,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంపెన శ్రీను,మాజీ ఎంపీటీసీ గొర్రెముచ్చ వెంకటరమణ,నాయకులు కడారి వేణు,మందా హుస్సేన్,శెట్టిపల్లి శేఖర్,హర్షవల్లి పవన్,పొడిశెట్టి రాములు గౌడ్,చలమల్ల ఉపేందర్ గౌడ్,పొడిశెట్టి వెంకన్న గౌడ్,మల్లేష్ గౌడ్,కాదర్ గౌడ్ బర్ల మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు

Previous నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Next సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
ADVERTISEMENT