| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు

అమ్మాయిలను వెంటపడి వేధిస్తే ఉపేక్షించేది లేదు

అమ్మాయిలు వేధింపులకు గురైతే నిర్భయంగా పిర్యాదు చేయండి

సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఒక యువతిని రుద్రంగి కి చెందిన సింగారపు గణేష్ అనే వ్యక్తి పరిచయం చేసుకుని ఆమెతో మాట్లాడుతు ప్రేమిస్తున్నని తనని పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడని ఆ యువతి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్లో  పిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని గణేష్ ని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించాడం జరిగిందని డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ప్రేమ–పెళ్లి పేరుతో వెంటపడడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. వేధింపులకు గురైన యువతులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Previous సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..
Next వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
ADVERTISEMENT