| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య..

పేదలకు సీఎం సహాయనిధి వరం..

డైలీ భారత్, వరంగల్: పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక వరంగా మారిందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలు వైద్య చికిత్సల కోసం దరఖాస్తు చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించి సహాయం అందిస్తున్నదని ఎంపీ తెలిపారు. హనుమకొండలోని కనకదుర్గ కాలనీలో ఉన్న ఎంపీ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను ఎంపీ స్వయంగా పంపిణీ చేశారు..

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.., 

పార్టీలకు అతీతంగా సహాయం కోరిన ప్రతి అర్హుడికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మొత్తం 10 మంది ఆపన్నులకు రూ.3 లక్షల 50 వేల విలువైన సహాయనిధి చెక్కులను అందజేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, అత్యవసర వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా ఉందని ఎంపీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు..

#cmrevanthreddy, #kadiyamkavya 

#warangal #MemberOfParliament 

#CMReliefFund

Previous రూ. 2 కోట్ల హవాలా నగదు సీజ్..
Next రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్‌కు తరలింపు
ADVERTISEMENT