Posted on 2026-04-08 13:52:21
తాగునీరు, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి – ఎంపీ పోరిక బలరాం నాయక్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన దిశా సర్వసభ్య సమావేశానికి ఎంపీ రామ సహాయం రఘు రామ్ రెడ్డి అధ్యక్షత వహించగా, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ సహాధ్యక్షుడిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్ IAS, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య , పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు , భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు , కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ , అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, దిశా కమిటీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
గత దిశా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, వివిధ శాఖల అభివృద్ధి పనుల పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించబడింది. పెండింగ్ పనులను వేగవంతం చేసి నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఎంపీ రామ సహాయం రఘు రామ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఎటువంటి నిర్లక్ష్యం వద్దని, ప్రతి పథకం లక్ష్యాలకు అనుగుణంగా లబ్ధిదారులకు సకాలంలో ప్రయోజనాలు చేరేలా పర్యవేక్షణ పెంచాలని సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సరఫరా, వైద్య సేవలు, విద్యుత్ వంటి ప్రాథమిక సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.
మణుగూరు, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం ప్రాంతాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యత, మరుగుదొడ్ల నిర్వహణ, అంబులెన్స్, డయాలసిస్ సేవల విస్తరణపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సికిల్ సెల్ అనీమియా, హెచ్పీవీ వ్యాక్సిన్ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు.
మిషన్ భగీరథ, అమృత్ పథకాల కింద తాగునీటి సరఫరా లోపాలు, పైప్‌లైన్ లీకేజీలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. జాతీయ రహదారులు, ఆర్ & బి, విద్యుత్ శాఖల పనుల ఆలస్యంపై నివేదికలు సమర్పించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిధులను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.
మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల వరకు త్రాగునీటి సరఫరా కల్పించాలని, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ IAS మాట్లాడుతూ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువుల్లో పూర్తి చేయాలని, దిశా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రాధాన్యంగా తీసుకుని అమలును వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సకాలంలో లబ్ధిదారులకు చేరేలా పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీరు, వైద్యం, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
శాసన సభ్యులు తమ నియోజకవర్గాల్లో అమలవుతున్న పథకాల పురోగతిపై అధికారుల నుంచి సవివర వివరాలు కోరారు.
ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు, దిశా కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు
Posted On 2026-08-01 15:38:14
Readmore >
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >