| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి11 వరకు ఆరోగ్య వారోత్సవాలు

వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి11 వరకు ఆరోగ్య వారోత్సవాలు

డైలీ భారత్, కామారెడ్డి: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా, IDOC సమావేశ మందిరంలో సురక్షిత మాతృత్వం కార్యక్రమం జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి  కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణకు సురక్షిత మాతృత్వం కార్యక్రమాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. తల్లి, శిశు ఆరోగ్యం రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యమైన అంశమని ఆయన అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న ఉచిత వైద్య సేవలు, ప్రసూతి సేవలను గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే, ఆరోగ్య సిబ్బంది గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు మరింత చురుకుగా పనిచేయాలని ఆదేశించారు.

అంగన్‌వాడీ మరియు ఆశా కార్యకర్తలు గ్రామ స్థాయిలో గర్భిణీలను గుర్తించి వారికి అవసరమైన పరీక్షలు, పోషకాహారం, టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్బంగా సురక్షిత మాతృత్వం పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్ లో 

గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, ప్రసవానికి ముందు  తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషకాహారం ప్రాముఖ్యత, అలాగే తల్లి, శిశువు సురక్షితంగా ఉండే విధానాలపై అవగాహన పెంపొందించడం.

కార్యక్రమంలో నిపుణులైన వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొని, గర్భధారణ సమయంలో తల్లులు ఎదుర్కొనే సమస్యలు, వాటి నివారణ మార్గాలు, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. అలాగే సురక్షిత ప్రసవం కోసం ఆసుపత్రుల్లోనే ప్రసవం జరగాలని సూచించారు.

ఈ వర్క్‌షాప్‌  పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తూ సమాజంలో సురక్షిత మాతృత్వంపై అవగాహన పెంపొందుతుందని  నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  dmho  రవీందర్, వైద్య శాఖ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఇతర సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Previous ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన డిఎస్పీ నాగేంద్రచారి
Next ట్రైనీ పైలట్ మీద అత్యాచారం
ADVERTISEMENT