| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన డిఎస్పీ నాగేంద్రచారి

ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించిన డిఎస్పీ నాగేంద్రచారి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాత బస్టాండ్ వద్ద మార్కండేయ ఫార్మసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిఎస్పీ నాగేంద్రచారి ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రయాణికులు, స్థానిక ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని డిఎస్పీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డిఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని, మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి ప్రజలకు సహాయం చేయాలని సూచించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఫార్మసీ సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Previous ఏసీబీ వలలో ఇన్‌స్పెక్టర్, ఎస్సై
Next వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి11 వరకు ఆరోగ్య వారోత్సవాలు
ADVERTISEMENT