| Daily భారత్
Logo




ట్రైనీ పైలట్ మీద అత్యాచారం

News

Posted on 2026-04-08 13:38:22

Share: Share


ట్రైనీ పైలట్ మీద అత్యాచారం

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. పైలట్ కావాలనే లక్ష్యంతో శిక్షణ కోసం వచ్చిన ఒక యువతిపై అదే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అత్యాచారానికి పాల్పడ్డాడు. కేరళకు చెందిన నసీముద్దీన్ అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు సదరు యువతికి శిక్షణ ఇస్తానంటూ దగ్గరై, మాయమాటలతో ఆమెను ప్రేమ వలలో దించి ఈ దారుణానికి పాల్పడ్డాడు. బాధితురాలు అందించిన ఫిర్యాదు ప్రకారం.. 2025 జనవరి నుంచి నిందితుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, బాధితురాలికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు గురిచేశాడు. నిందితుడి వేధింపులు మితిమీరిపోవడంతో తట్టుకోలేక బాధితురాలు తన నివాసాన్ని దమ్మాయిగూడకు మార్చుకుంది. అయినప్పటికీ, నిందితుడు ఆమెను వదలకుండా బెదిరింపులు కొనసాగించడంతో, విసుగు చెందిన యువతి తన పైలట్ శిక్షణను మధ్యలోనే ఆపేసింది.

చివరికి ధైర్యం చేసి బాధితురాలు బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. తనపై జరిగిన అఘాయిత్యం, ఎదుర్కొన్న బెదిరింపుల గురించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు తక్షణమే స్పందించారు. నిందితుడు నసీముద్దీన్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన విద్యా, శిక్షణా సంస్థల్లోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లా పాపకొల్లులో ఆషాడ బోనాల సంబరాలు... ఆదివారం కోట మైసమ్మకు ప్రత్యేక పూజలు

Posted On 2026-08-01 15:38:14

Readmore >
Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >
Image 1

వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

Posted On 2026-08-01 14:10:03

Readmore >
Image 1

సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న

Posted On 2026-08-01 07:48:28

Readmore >
Image 1

నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-01 07:45:01

Readmore >
Image 1

ఘనంగా హిందీ కవి మున్షీ ప్రేమచంద్ జయంతి నిర్వహణ

Posted On 2026-08-01 05:11:18

Readmore >
Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >