| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, పోషక ఆహారం అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, పోషక ఆహారం అందించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఔట్‌పేషెంట్ విభాగంలో రోగులతో మాట్లాడి సేవలు, సమస్యలపై వివరాలు తెలుసుకున్నారు. మహిళల వార్డు సహా పేషెంట్ వార్డులను పరిశీలించి రోగుల సంరక్షణపై ఆరా తీశారు.

ల్యాబ్‌ను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ, రిజిస్టర్‌ను పరిశీలించారు. మందుల గది, స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి అవసరమైన ఔషధాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

ఆరోగ్యశ్రీ సేవల అమలుపై వివరాలు సేకరించి అర్హులైన ప్రతి రోగికి సమయానికి సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రేడియాలజీ, స్కానింగ్, ఎక్స్-రే విభాగాల్లో ఆలస్యాలపై ఆరా తీసి, టెక్నీషియన్‌ల కొరత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పేషెంట్ వార్డుల్లో రోగులకు అందించే ఆహారాన్ని పరిశీలించి, నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోషకాహారంలో అరటిపండ్లు, గుడ్లు అందించకపోవడాన్ని ప్రశ్నించి, ప్రభుత్వం నిధులకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు.

Previous అశ్వాపురం మండలంలోని గుత్తి కోయ గ్రామమైన గుండ్లమడుగు గ్రామోత్సవ సమావేశం
Next భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో కొత్త కో ఆప్షన్. జూపల్లి రమేష్ అనుచరుడు ఎండి గౌస్ డా.దక్కే అవకాశం
ADVERTISEMENT