| Daily భారత్
Logo




సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ : జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్

News

Posted on 2026-04-05 14:54:56

Share: Share


సామాజిక సమానత్వం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ : జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్

డైలీ భారత్, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్  119వ జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిధిగా పాల్గొని  బాబు జగ్జీవన్ రామ్  చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయ కొట్టి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్  దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను పాటిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు.

సామాజిక సమానత్వం, న్యాయం కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప నాయకుడని, సమాజంలోని వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.

అతని ఆలోచనలు, ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ వాటిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. 

దేశ నిర్మాణంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగడం ద్వారా సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 

తన రాజకీయ జీవితంలో అనేక ముఖ్యమైన పదవులు నిర్వహిస్తూ దేశానికి విశిష్ట సేవలు అందించిన నాయకుడని తెలిపారు.

ఆయన కేంద్ర మంత్రిగా వివిధ శాఖలను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా, వ్యవసాయం, రక్షణ, కార్మిక రంగాలలో కీలక నిర్ణయాలు తీసుకుని దేశ అభివృద్ధికి దోహదపడ్డారని పేర్కొన్నారు. ముఖ్యంగా భారత రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో దేశ భద్రతను మరింత బలోపేతం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అలాగే, ఉప ప్రధాని హోదాలో కూడా దేశ పరిపాలనలో కీలక పాత్ర పోషించి ప్రజల విశ్వాసాన్ని పొందారని అన్నారు. ఆయన జీవితాంతం సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేసిన మహానేతగా నిలిచారని కొనియాడారు.

ఈ సందర్బంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్ మధుమెహన్, ఆర్డిఓ ఎన్వి  గిరి, మున్సిపల్ చైర్ పర్సన్ ఉమారాణి, ఎస్సి  కార్పొరేషన్ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, టీ ఎన్జీవోస్  జిల్లా కార్యదర్శి నాగరాజ్,సంఘ సభ్యులు కొత్తపల్లి మల్లన్న, మాజీ జెడ్పి వైస్ చైర్మన్  పర్కి ప్రేమ్ కుమార్ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులుకొత్తోల్ల గంగారం , ⁠క్యాథం సిద్దిరములు, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల బాబు ఎమ్మార్పీఎస్ నాయకులు దుభాసి నరేందర్ బట్ట వెంకట రాములు బట్టంకి బాలరాజు-, శివ రాములు వేముల బలారం బాలమణి, గణేష్ నాయక్-ఎల్ఎచ్ పి ఎస్ సంపత్ గడ్డం బిక్కనుర్ యాదయ్య బోలేశ్వర్--దళిత శక్తి కార్యక్రమ గైని  రాజు.సంఘి రాజలింఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అంబేద్కర్ సంఘం ఎర్ర శివరాజ, - మాలమహానాడు రాష్ట్ర నాయకులు రాజ నర్స్, రజక సంఘం అధ్యక్షులుcచాకలి రాజయ్యా - బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు  నీల నాగరాజు అధ్యక్షులు, విట్టాల్ ముదిరాజ్, జి వీ ఎం విట్టాల్ బీవీఎం రాష్ట్ర కార్యదర్శి, రాజ్ కుమార్ సాయి గౌతం -జిల్లా ప్రెసిడెంట్ బాంసెఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ  కొంగల  వెంకట్,  ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, డి ఈ టి ఏ జంగం శ్రీశైలం చిట్యాల సాయన్న పత్రీ అశోక్ – దళిత శక్తి సమన్వయ కర్త .కంకణాల రమేష్- మాలమహానాడు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >