Posted on 2026-04-05 14:29:55
రామంతపూర్ వెంకట సాయి నగర్‌లో ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
డైలీ భారత్, రామంతపూర్: రామంతపూర్, వెంకట సాయి నగర్ కాలనీలో ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో, నాయి బ్రాహ్మణ సేవ సంఘం మరియు శ్రీ శ్రీ శ్రీ మైసమ్మ దేవాలయం ఆవరణలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంకు స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ప్రతినెల మొదటి ఆదివారం నిర్వహించే ఈ సేవా కార్యక్రమం ఈ నెల 05-04-2026 ఆదివారం ఉదయం 8:00 గంటల నుండి 11:30 గంటల వరకు విజయవంతంగా జరిగింది. గత రెండు సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న ఈ వైద్య శిబిరం ద్వారా ప్రజలకు ఉచిత వైద్యం, ఉచిత ఔషధాలు, రక్తపరీక్షలు అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.
ఈ శిబిరంలో మహిళలు, పురుషుల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రజలకు సౌకర్యవంతంగా సేవలు అందించారు. ముఖ్యంగా థైరాయిడ్ పరీక్షలు, షుగర్ టెస్టులు, రక్తపరీక్షలు నిర్వహించారు.
అలాగే గైనకాలజీ స్పెషలిస్ట్ వైద్యులు, ఆర్థోపెడిక్ నిపుణులు, కంటి సంబంధిత ఆఫ్తమాలజీ వైద్యులు పాల్గొని వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు.
ఈ శిబిరం ద్వారా కాలనీవాసులు మాత్రమే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా లాభపడుతున్నారని, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని నిర్వాహకులు తెలిపారు.
సమాజానికి ఉపయోగపడే ఈ తరహా సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని స్థానిక ప్రజలు ఆకాంక్షించారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >