| Daily భారత్
Logo




వేములవాడ తిప్పాపురం గోశాలలో ఆకస్మిక తనిఖీలు

News

Posted on 2026-04-02 15:39:34

Share: Share


వేములవాడ తిప్పాపురం గోశాలలో ఆకస్మిక తనిఖీలు

కోడెలకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించిన ఈవో 

డైలీ భారత్, వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.

కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా  పరిశీలించారు.

అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.

ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >