| Daily భారత్
Logo




డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఆవేదన

News

Posted on 2026-04-02 15:44:47

Share: Share


డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఆవేదన

టవర్ ఎక్కిన వ్యక్తి ఘటన రాజంపేటలో ఉద్రిక్తత

ఇల్లు కేటాయించలేదని ఆత్మహత్యాయత్నం చేసిన హైమద్..

అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు:

తహసీల్దార్ ముందు కాళ్లు మొక్కిన ఘటన కలకలం..?

పారదర్శకత కోరుతూ అధికారులపై స్థానికుల ఆగ్రహం..?

డైలీ భారత్, రాజంపేట: రాజంపేట మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకంలో తనకు ఇల్లు కేటాయించలేదన్న ఆవేదనతో హైమద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం కలకలం రేపింది. పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ సరైన స్పందన రాలేదని ఆయన ఆరోపించారు. తన సమస్యను తెలియజేయడానికి పత్రికా విలేకరుల సమావేశానికి వెళ్లగా పోలీసులు అడ్డుకోవడంతో మరింత నిరాశకు గురైనట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేశానికి లోనైన హైమద్ టవర్‌పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించడం పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని చాకచక్యంగా వ్యవహరించి అతనిని కిందికి దించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

అయితే తరువాత కూడా తన సమస్య పరిష్కారం కాలేదని భావించిన హైమద్, ప్రధాన కార్యాలయం వద్ద తహసీల్దార్ జానకి వద్దకు వెళ్లి కాళ్లు మొక్కి తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన అక్కడ ఉన్న వారిని కలచివేసింది. ప్రజల సమస్యలు వినిపించుకునే పరిస్థితి లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానికులు విమర్శించారు.

గ్రామస్థులు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత ఉండాలని, అర్హులైన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఆవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ ఘటన రాజంపేటలో చర్చనీయాంశంగా మారగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రాజంపేట మండల ప్రజా రాజ్యాధికార పార్టీ మండల అధ్యక్షుడు అనిల్ పటేల్ మాట్లాడుతూ తాసిల్దార్ తప్పులు వల్ల అమాయకులు బలి అవుతున్నారు కావున తాసిల్దార్ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఒక అధికారి అయ్యి కాళ్లు మొక్కు పెంచుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ఈ సందర్భంగా  రామన్న రెండు రోజుల్లో రాజాధికార పార్టీ వ్యవస్థాపకులు వద్దకు ఈ విషయాన్ని చేరవేస్తానని బాధితులకు పత్రిక ముఖంగా ఆయన తెలిపారు అలాగే తాసిల్దార్ ను సస్పెండ్ చేస్తూ ఆర్డిఓ కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు..

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >